Home » Radhe Shyam : రాధేశ్యామ్ ట్రైలర్ విడుద‌ల‌.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్‌

Radhe Shyam : రాధేశ్యామ్ ట్రైలర్ విడుద‌ల‌.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్‌

by Anji
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోంది. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ జంట‌గా పూజాహెగ్దే న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గానే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు అన్నీ హంగులు పూర్తి చేసుకుని మార్చి 1న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

Advertisement

Advertisement

ఈ త‌రుణంలో సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది చిత్ర‌బృందం. ఇదివ‌ర‌కే ఒక‌సారి ట్రైల‌ర్ విడుద‌ల చేసింది రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌. అయితే సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌టంతో రిలీజ్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. మ‌నం ఆలోచిస్తామ‌ని భ్ర‌మ‌ప‌డ‌తాం. కానీ మ‌న ఆలోచ‌న‌లు కూడా ముందుగానే రాసిపెట్టుంటాయి. అని ప్ర‌భాస్ డైలాగ్‌ల‌తో మొద‌లైన ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇంకొక‌సారి చెయ్యిచూడని.. నాకు రెండ‌వ సారి చెయ్యి చూసే అల‌వాటు లేదు అంటూ జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌భాస్‌ల మ‌ధ్య వ‌చ్చే డైలాగ్‌లు బాగా పేలాయి. ట్రైల‌ర్ చివ‌రిలో ప్రేమ విష‌యంలో ఆదిత్య ప్రెడిక్ష‌న్ త‌ప్పు అని పూజా చెప్పిన డైలాగ్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్రలో హ‌స్త‌సాముద్రికుడిగా క‌నిపించ‌నున్నారు. అత‌ని ప్రేయ‌సి ప్రేర‌ణ‌గా పూజా హెగ్దే క‌నిపించ‌నున్న‌ది.

1970-80 కాలం నాటి ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కింది. ప్రేమ‌, విధి మ‌ధ్య పోరాటంగా ఈ సినిమా ఉండ‌నున్న‌ది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన వీడియో సాంగ్స్‌, గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు ప్ర‌భాస్ అభిమానుల నుంచి అపూర్వ స్పంద‌న వ‌చ్చింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ అయిన‌ప్ప‌టికీ యాక్ష‌న్ సీక్వెన్స్ కూడా ఊహించ‌ని ట్విస్టుల‌తో సినిమా ఉంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు. రాధేశ్యామ్ సినిమాకు జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ బాణిలు స‌మ‌కూరుస్తుండ‌గా ఎస్‌.థ‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మందిస్తున్నారు.

Also Read :  వ‌రుణ్ తేజ్ ‘గ‌ని’ విడుద‌ల తేదీ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading