Home » ‘రాధేశ్యామ్’లోని ‘సంచారి’ టీజర్ వచ్చేసింది..

‘రాధేశ్యామ్’లోని ‘సంచారి’ టీజర్ వచ్చేసింది..

by Bunty
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్స ప్రచార ప‌ర్వం జోరు అందుకుంది. డిసెంబ‌ర్ 16న విడుద‌ల కాబోతున్న సంచారి గీతానికి సంబంధించిన టీజ‌ర్‌కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. తెలుగులో సంచారి ఛ‌లో ఛ‌లో అంటూ సాగే ఈ పాట హిందీలో ఉడ్ జా ప‌రిందా అంటూ మొద‌లైన‌ది. తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ వంటి ఇత‌ర భాష‌ల్లో కూడా టీజ‌ర్ను సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించారు.

Advertisement

Advertisement

నూత‌న పాట‌తో నేల‌పై సంచారి ప్ర‌యాణం చూపించ‌బోతున్న‌ట్టు ఈ టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది. 1979లో యూర‌ప్‌లో ఉండే విక్ర‌మాదిత్య అనే ఫామిస్ట్‌గా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా.. ప్రేర‌ణ అనే ఫిజిషియ‌న్ పాత్ర‌ను పూజా హెగ్దే పోషిస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే సంవ‌త్స‌రంజ‌న‌వ‌రి 14న వ‌రల్డ్ వైజ్‌గా విడుద‌ల కానున్న‌ది. విడుద‌లైన ఈ సినిమాలో పాట‌లు, టీజ‌ర్ మూవీని ఎంత భారీగా తీసారో ఇట్టే అర్థ‌మ‌వుతొంది. 16న వ‌చ్చే ఈ సంచారి పాట కూడా అంచెనాల‌ను భారీగానే పెంచేలా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading