సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాన్ ఇండియా సినిమాలో రాధేశ్యామ్ చిత్రం ఒకటి. స్టార్ హీరో ప్రభాస్, హీరోయిన్ పూజాహెగ్దే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్‌స్టోరీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈసినిమా పామిస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా లవ్ స్టోరీతో పాటు 1970 కాలంలో జరిగిన ఓ ప్రముఖ ఫామిస్ట్ లైప్ స్టోరీ ఈ చిత్రంలో ప్రస్తావించినట్టు సమాచారం.
Also Read : 13th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!
Advertisement
సినిమా విడుదలయ్యే సరికి ఇదంతా నిజమా కాదా..? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అందుకు కారణం కూడా దర్శకుడు రాధాకృష్ణకుమార్ అనే చెప్పవచ్చు. ప్రముఖ పామిస్ట్ లైఫ్ స్టోరీ నుంచి స్పూర్తి పొందినట్టు చెప్పడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కలిగింది. అప్పటినుంచి రాధేశ్యామ్ పామిస్ట్ పాత్రకు స్ఫూర్తి అయిన పర్సన్ ఎవరా..? అని ఆరా తీయడం ప్రారంభించారు. అతను ప్రముఖ ఐరిష్ హస్త సాముద్రిక నిపుణులు చిరో.. ఆయన అసలు పేరు విలియమ్ జాన్ వార్నర్.
Advertisement
అప్పట్లో కొన్నేళ్ల పాటు ఇండియాలో ఉండి పామిస్ట్రి నేర్చుకుని ఆ తరువాత లండన్‌కు వెళ్లిపోయాడట. రాధేశ్యామ్ సినిమాలో చివరి 20 నిమిషాలు లండన్‌లోనే చిత్రీకరించినట్టు సమాచారం. రాధేశ్యామ్ స్టోరీ పాయింట్ పదిహేనేళ్ల క్రితమే తన గురువు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర నుంచి తీసుకున్నాడు. చాలా ఏండ్లు ఆ స్టోరీ పాయింట్ ను డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. పలువురు రచయితలతో చర్చించిన తరువాతనే స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్ వంటి సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని టాక్ వస్తోంది.
ఇదిలా ఉండగా.. పామిస్ట్రీ నిపుణుడు చిరో ఎన్నో పుస్తకాలను రచించారు. ఇండియాలోనే హస్తముద్రికం, జ్యోతిష్యం, కల్దీయన్ సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకున్నట్టు స్వయంగా తెలిపారట. ఆయన 1866లో జన్మించిన చిరో.. 1936లో మరణించాడు. అతని లైఫ్లో పామిస్ట్రీ పై, భవిష్యత్ పై, జ్యోతిష్యంపై సైన్స్‌పై ఇలా ఎన్నో పుస్తకాలను రచించారు. రాధేశ్యామ్ చిత్రం ద్వారా చిరోను మరొకసారి గుర్తు చేసుకుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పోషించిన విక్రమాదిత్య క్యారెక్టరైజేషన్ కి రియల్ హీరో చిరో అని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ప్రభాస్ క్యారెక్టర్‌పై, చిరో పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Also Read : IND VS SL 2nd Test : పింక్ బాల్ టెస్ట్‌ల్లో నూతన రికార్డు