Home » బ‌న్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…పుష్ప ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..!

బ‌న్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…పుష్ప ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ఫ‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో ఫ‌హ‌ద్ ఫ‌జిల్, సునీల్ విల‌న్ లు గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి టీజ‌ర్ మరియు పాట‌లు విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా తాజాగా చిత్ర యూనిట్ పుష్ప ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టిచింది. డిసెంబ‌ర్ 6 వ తేదీన ట్రైల‌ర్ ను విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టిచింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నారు.

Advertisement

pushpa trailer on dec 6th

pushpa trailer on dec 6th

ఇదిలా ఉండ‌గా ఈ సినిమాను రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా మొద‌టి పార్ట్ లో విల‌న్ గా కనిపించ‌నుండ‌గా రెండో పార్ట్ లో ఫ‌హ‌ద్ ఫాజిల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రో వైపు ఈ సినిమాలో అన‌సూయ కూడా న‌టిస్తోంది. రీసెంట్ గా అన‌సూయ లుక్ రివీల్ చేయ‌గా అంతా అవాక్క‌య్యారు. అన‌సూయ మాత్ర‌మే కాకుండా ముందు నుండి సినిమాలో ప్ర‌తి ఒక్క‌రి లుక్ ఊహ‌ల‌కు అంద‌ని విధంగానే సుక్కూ తీర్చిదిద్దాడు. ఇక సినిమా నుండి విడుదలైన టీజ‌ర్, పాట‌లు యూట్యూబ్ ను షేక్ చేయ‌గా ట్రైల‌ర్ కు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading