Home » నెద‌ర్లాండ్ సింగ‌ర్ నోట శ్రీవ‌ల్లి పాట‌…వీడియో వైర‌ల్..!

నెద‌ర్లాండ్ సింగ‌ర్ నోట శ్రీవ‌ల్లి పాట‌…వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా పుష్ప క్రేజ్ క‌నిపిస్తోంది. టాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండ‌స్ట్రీతో ప‌నిలేకుండా ప్ర‌తిచోటా పుష్ప పాట‌లు,పుష్ప డైలాగులే క‌నిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. కేల‌వంలో మ‌న‌దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పుష్ఫ జోరు క‌నిపించ‌డం చెప్పుకోదగ్గ విష‌యం. పలువురు స్టార్ క్రికెట‌ర్లు పుష్ప‌సినిమా డైలాగులు చెప్ప‌డం….పాట‌ల‌కు స్టెప్పులు వేయ‌డం కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా తాజాగా నెదర్లాండ్ గాయ‌ని ఎమ్మా హీస్ట‌ర్ పుష్ప‌సినిమాలోని శ్రీవ‌ల్లి పాట‌ను ఇంగ్లీష్ వ‌ర్ష‌న్ లో పాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక పాట‌ను దేవీశ్రీ ప్ర‌సాద్ చూడ‌టంతో సోష‌ల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు. హే శ్రీరామ్ బ్రో మ‌నం శ్రీవ‌ల్లి పాట‌ను రికార్డ్ చేస్తున్న‌ప్పుడు శ్రీవ‌ల్లి పాట‌ను ఇంగ్లీష్ వ‌ర్ష‌న్ చేయాల‌నుకున్నాం క‌దా..ఇదిగా శ్రీవ‌ల్లికి ఇంగ్లీష్ వ‌ర్ష‌న్ వ‌చ్చేసింది. అంటూ ఎమ్మా హీస్ట‌ర్స్ పాట‌ను షేర్ చేశారు.

Visitors Are Also Reading