Home » ‘పుష్ప’ మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీకి ముహూర్తం ఖరారు

‘పుష్ప’ మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీకి ముహూర్తం ఖరారు

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా అల్లుఅర్జున్ చేస్తుండగా… ఆయన సరసన హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు,

Advertisement

టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది పుష్ప యూనిట్. డిసెంబర్ 12వ తేదీన యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు పుష్పం చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading