Home » పుష్ప పార్ట్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్ …ఎప్పుడంటే….!

పుష్ప పార్ట్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్ …ఎప్పుడంటే….!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో దర్శకుడు సుకుమార్ మరియు హీరో అల్లు అర్జున్ తో పాటు సినిమాలో నటించిన నటీనటుల క్రేజ్ భారీగా పెరిగిపోయింది. పలువురు స్టార్ క్రికెటర్లు ఈ సినిమాలోని డైలాగులను సోషల్ మీడియాలో అనుకరిస్తున్నారు.

Advertisement

Advertisement

సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ చిత్రంలోని పాటలు , డైలాగులు కనిపిస్తున్నాయి. పుష్ప ది రైస్ పేరుతో ఫస్ట్ పార్ట్ ను విడుదల చేయగా…. ఈ సినిమా మరో పార్ట్ ఇంకా చూడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విజయంతో పాటు పార్ట్ -2 పై అంచనాలు రెట్టింపయ్యాయి. నిజానికి పుష్ప పార్ట్ 1 తరవాత అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఈ సినిమా విజయంతో పుష్ప పార్ట్ ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట.

అంతేకాకుండా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2022 డిసెంబర్ 17న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2021 డిసెంబర్ 17న మొదటి పార్ట్ పుష్ప ది రైస్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో బన్వార్ సింగ్ శకవత్ ఎంట్రీ ఇచ్చాడు. పార్ట్ 2 లో వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి. శకావత్ ఎలా పగ తీర్చుకుంటారు అన్నది చూపించబోతున్నారు.

Visitors Are Also Reading