ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో హాట్రిక్ మూవీగా బాక్సాపీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ చిత్రం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా భారీగానే కలెక్షన్లను వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక ఓటీటీలో ప్రసారం కానున్నదని తెలుస్తుండటం బన్నీ అభిమానులను హుషారెత్తిస్తోంది.
Advertisement
మరొక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 07న అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగులో తప్పితే మిగిలిన భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది అని, తెలుగు వర్షన్ మాత్రం ఆహాలో స్ట్రీమ్ కానున్నదని పేర్కొంటున్నారు. ఈ సమాచారంతో ప్రేక్షకులు సరికొత్త ఆతృత మొదలైంది.
Advertisement
మరోవైపు థియేటర్లలో పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా 300 కోట్ల మార్క్ దాటేయడం విశేషం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఈ సినిమాకు భారీ ఆదరణే లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప ఓటీటీ విడుదల అనే అంశం తెరపైకి రావడంతో ప్రజల్లో ఉరకలేసే ఉత్సహాన్ని నింపుతుంది. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. చూడాలి ఓటీటీలో జనవరి 07న స్ట్రీమింగ్ అవుతుందా లేదా మరీ.