టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది విడుదలైన సినిమా పుష్ప. ఇందులో అల్లు అర్జున్ మాస్ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే అల్లు అర్జున్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది పుష్ప. కానీ ఈ సినిమా పైన పెద్దగా అంచనాలు అనేవి అప్పుడు లేవు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత సూపర్ సక్సెస్ అనేది సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ”తగ్గేదే లే” అనే డైలాగ్ తో పాటుగా ఆ యాక్షన్ అనేది జనాలను బాగా ఆకట్టుకుంది. చిన్న వాళ్ల నుండి పెద్ద వాళ్ల దాకా.. సినిమా నటుల నుండి క్రికెటర్స్ దాకా అందరూ దీనిని ఇమిటేట్ చేసారు.
Advertisement
అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అంతటా సూపర్ సక్సెస్ అనేది సాధించగా.. ఇప్పుడు మరో రికార్డ్ అనేది తన ఖాతాలో వేసుకుంది. అయితే పుష్ప సినిమాలోని పాటలు అనేవి ఓ ట్రెండ్ ను సెట్ చేసాయి. ఈ సినిమా కంటే ముందు అల్లు అర్జున్ చేసిన అలా వైకుంఠపురంలో సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ పుష్ప సినిమాలోని సాంగ్స్ అంతకుమించి అనే రేంజ్ లో హిట్ అయ్యాయి. కేవలం మన తెలుగులోనే కాకుండా.. విడుదలైన ప్రతి భాషలో దేవి శ్రీ ప్రసాద్ యొక్క సంగీతం అనేది ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
Advertisement
దాంతో ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ అనేది ఓ కొత్త మార్క్ ను అందుకుంది. పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, శ్రీవల్లి, ఊ అంటావా ఊఊ అంటావా అనే పాటలో మొత్తం ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాటలో కలిపి ఏకంగా 5 బిలియన్ వ్యూస్ అనేవి అందుకున్నాయి. అంటే ఈ పుష్ప ఆల్బమ్ అనేది మొత్తం 500 కోట్ల వ్యూస్ ను సాధించడం ఓ రికార్డ్. ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరోకు కూడా ఈ రికార్డ్ అనేది అసాధ్యం కాలేదు. ఎందుకంటే.. మాములుగా ఒక సినిమాలోని ఒక్క పాట హిట్ అవుతుంది. కానీ ఇందులో అన్ని పాటలు హిట్ కావడమే ఇందుకు కారణం.
ఇవి కూడా చదవండి :