Home » PUSHPA COLLECTIONS : త‌గ్గేదే లే అంటున్న పుష్ఫ రాజ్..ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

PUSHPA COLLECTIONS : త‌గ్గేదే లే అంటున్న పుష్ఫ రాజ్..ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

by AJAY
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17 విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్ర‌మ‌స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు మాత్రం గ‌ట్టిగానే వస్తున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల నుండి స‌మాచారం అందుతోంది. ఫ‌స్ట్ డే పుష్ప ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47.50 కోట్ల వ‌సూళ్లు రాబ్టిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అందులో నైజాంలో రూ.11.44 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఓవ‌ర్ సీస్ లో కూడా భారీ క‌లెక్ష‌న్లు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. శుక్రావారం 333 లొకేష‌న్ల‌లో పుష్ప‌కు 386,682 డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Advertisement

Advertisement

ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్ల‌తో క‌లుపుకుని 930,285 డాల‌ర్ల క‌లెక్షన్ల‌ను రాబ‌ట్టింది. అంటే మ‌న లెక్క‌న ఫ‌స్ట్ డే రూ.7.1 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. హిందీలో పుష్ప వ‌సూళ్ల ప‌రంగా వెన‌క‌బ‌డినట్టు తెలుస్తోంది. అక్క‌డ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద‌గా చేయ‌క‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ క‌లెక్ష‌న్ల‌పై చూపించిన‌ట్టు క‌నిపింస్తోంది. ఫ‌స్ట్ డే మొత్తంగా రూ.4.5 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఇక పుష్ప క‌లెక్ష‌న్ల వివ‌రాల‌ను చిత్ర యూనిట్ మ‌రికొద్ది గంట‌ల్లోనే వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా సుకుమార్ బ‌న్నీకి కెరీర్ లో బెస్ట్ సినిమా ఆర్య ఇచ్చాడు. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబోలోనే ఆర్య 2 సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు కూడా మిశ్ర‌మ‌స్పంద‌న ల‌భించింది. కానీ ఈ చిత్రంతో బ‌న్నీ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. ఇక వీరి కాంబోలోనే మూడో సినిమాగా పుష్ప వ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న న‌టించింది. సునీల్, ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్లు గా న‌టించారు. అన‌సూయ‌, రావు ర‌మేష్ లాంటి న‌టీన‌టులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

Visitors Are Also Reading