ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రైస్ పేరుతో ఈ చిత్రం విడుదల అయింది. కేవలం హిట్ టాక్‌తోనే కలెక్షన్ల పరంగా కూడా బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. మరో విషయం ఏమిటంటో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్ లో సైతం సత్తాను చాటడం విశేషం.
Advertisement
బాలీవుడ్ దాదాపు రూ.100 కోట్ల వరకు పుష్ప సినిమా వసూళ్లు సాధించి అదరగొట్టింది. పుష్ప రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నామని ముందుగానే దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. ఇప్పుడు పుష్ప తొలి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక రెండో పార్ట్ తెరకెక్కించాలా వద్దా అనే దానిపై అనుమానం లేకుండానే పోయింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. పుష్ప ది రూల్ అనే సెకండ్ పార్ట్ రాబోతుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో లీకుల బెడద ఇబ్బందికరంగా మారిపోయింది.
ఇది కూడా చదవండి : అలనాటి హీరో సుమన్ ఆ కేసుల్లో ఇరుక్కోవడానికి గల కారకులు ఎవరు ? అర్ధరాత్రి పోలీసులు వచ్చి అలా పట్టుకెళ్లారు ?
Advertisement
కొన్నిసార్లు సినిమాలోని సన్నివేశాలు లీకవుతుంటే.. కొన్నిసార్లు స్టోరీ లైన్ పాయింట్లు లీకవుతూనే ఉంటాయి. ఈ తరుణంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న పుష్ప 2 కి సంబంధించి ఇప్పుడు స్టోరీ లైన్ లీక్ అయినట్టు తెలుస్తోంది. రెండో పార్ట్‌లో అల్లుఅర్జున్ ని సుకుమార్ రూలర్ గా చూపించబోతున్నట్టు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో సిండికేట్ మొత్తాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న పుష్ప రెండో పార్ట్ లో ఎమోషనల్ సెంటిమెంట్ టచ్ చేస్తూ తెరకెక్కించబోతున్నాడట. ప్రధానంగా తల్లి సెంటిమెంట్ పుష్పలో టర్నింగ్ పాయింట్‌గా మారబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తనని కాదు అని తన తల్లిని హేళన చేస్తున్న అన్నలను పుష్ప రెండో పార్ట్‌లో దారిలోకి తీసుకొస్తాడట. అంతేకాదు.. ఏసీపీగా ఉన్న ఫాహద్ పజిల్ సిండికేట్‌కి పెద్దగా కొనసాగుతున్న పుష్ప మధ్య యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగానే ఉంటాయట. పుష్ప 2 లో కనిపించబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి : సూపర్ గొప్పతనం అంటే అదే ! చిరంజీవి ఆ సినిమాలో నటిస్తున్నాడని తెలిసి అంతటి త్యాగం చేసారా ?