Home » పుష్ప 2 లో దాగి ఉన్న స్టోరీ ఏమిటి..? సుకుమార్ ఇంత పెద్ద హింట్ ఇచ్చేసారా..?

పుష్ప 2 లో దాగి ఉన్న స్టోరీ ఏమిటి..? సుకుమార్ ఇంత పెద్ద హింట్ ఇచ్చేసారా..?

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్ 1 అదిరిపోయింది. ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప వన్ లో అల్లు అర్జున్ నటనకి ఏకంగా జాతీయ ఉత్తమ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు పుష్ప టు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు ప్రేక్షకులు. పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో ఉన్న సస్పెన్స్ ని కంటిన్యూ చేస్తూ పుష్ప టు సినిమా తీస్తున్నారు సుకుమార్.

Advertisement

పుష్ప ఎక్కడికి పారిపోయాడు అనే డౌట్ ని సుకుమార్ తీసుకువచ్చారు. పుష్ప పార్ట్ 1 మొదట్లో జపాన్, చైనా దేశాల ప్రస్తావన కూడా వస్తుంది. ఎర్రచందనం తరలించేది చైనా, జపాన్ కి అని అంటారు. అయితే పుష్ప టు టైటిల్ డిజైన్ ని చూస్తే స్టోరీని లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. లోగోని గమనించినట్లయితే గ్రీన్ కలర్ లో డ్రాగన్ లాంటి సింబల్ ఉంటుంది.

pushpa the rule

Advertisement

డ్రాగన్ అంటే చైనా. మరి ఇలా సుకుమార్ హింట్ ఇచ్చినట్టు అర్ధం అవుతోంది. ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఆగాలి. 2024 ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also read:

Visitors Are Also Reading