Home » పుష్ప 2 రిలీజ్ డేట్ రూమర్స్ కి చెక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

పుష్ప 2 రిలీజ్ డేట్ రూమర్స్ కి చెక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా తొలుత ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 మూవీపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. 

Advertisement

ప్రధానంగా  తొందరపడి ఏదో ఒకటి చేయను. ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను అంటూ ఓ సినిమాలో ఎమ్మెస్ నారాయణ డైలాగ్ చెబుతారు..  ఇప్పుడు అదే డైలాగ్ ను సుకుమార్ అండ్ టీం కూడా ఇదే చేస్తున్నారు. రెండు విషయాలలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. కంగారు పడటం లేదు లెక్కల మాస్టారు. రిలీజ్ విషయంలో తన ప్లానింగ్స్ తనకున్నాయంటున్నారు. సుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. ఈ మూవీతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలనుకుంటున్నారు  లెక్కల మాస్టారు. అందుకే మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15, 2024న విడుదల కానుంది పుష్ప 2.

Advertisement

రిలీజ్ డేట్ మారింది అంటూ జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని తెలిపింది చిత్రయూనిట్. ఆగస్టు 15న రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. 5 రోజుల లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ కలెక్షన్లపై కన్నేసారు పుష్ప రాజ్. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్ లో కూడా పుష్ప 2ను విడుదల చేయొచ్చు కానీ ఆలస్యమైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే రావాలని చూస్తున్నారు మేకర్స్. మార్చ్ వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా జూన్, జూలై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ అండ్ టీం. బాలీవుడ్ లోనూ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే నార్త్ పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఎలా చూసుకున్నా కంగారేం లేకుండా కాంప్రమైజ్ కాకుండా పుష్ప రాజును బరిలోకి దించనున్నారు సుకుమార్.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading