Home » బ్లండ గణేష్ కు పంచ్ ఇచ్చిన పూరి… నాలుక అదుపులో పెట్టుకో..!

బ్లండ గణేష్ కు పంచ్ ఇచ్చిన పూరి… నాలుక అదుపులో పెట్టుకో..!

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో మొత్తం బండ్ల గణేష్ స్పీచ్ పైనే చర్చ జరుగుతుంది. తాజాగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన చోర్ బజార్ యొక్క సినిమా ఫంక్షన్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్ తెగ వైరల్ గా మారాయి. దాంతో అతని పై విమర్శలు, ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. అయితే ఈ బండ్ల స్పీచ్ పై ఇప్పటివరకు మన పూరి జగన్నాథ్ ఏం స్పందించలేదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ తాజాగా బండ్ల వ్యాఖ్యల పై పూరి గట్టిగానే బదులిచ్చాడు. కానీ అది డైరెక్ట్ గా కాదు ఇన్ డైరెక్ట్ గా.

Advertisement

అయితే ఈ మధ్య పూరి ఏం చెప్పాలి అనుకున్న.. సోషల్ మీడియా వేదికగా ఓ ఆడియో క్లిప్ అనేది పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ ఆడియో క్లిప్ నే పూరి పోస్ట్ చేసాడు. అందులో ఏం ఉంది అంటే… మన జీవితంలో మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏం నేర్చుకోలేం. అందుకే ఎక్కువ సేపు మన వింటూ ఉంటే . అది మీ జీవితంలో ఎవరైనా కానీ… మీ ఫ్యామిలీ మెంబర్స్ .. ఫ్రెండ్స్ కావచ్చు.. ఆఫీస్ కోలిక్స్ .. ఆఖరికి మీ భార్య అయిన సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.. ఏదిపడితే అది చీప్ గా మాట్లాడొద్దు.. చీప్ గా బిహేవ్ చేయమవద్దు. మనం ఏం మాట్లాడుతామో అదే మన కెరీర్ ను మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు పుమతి శతకంలోని ఓ పద్యం గుర్తుకు రావాలి. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి.

Advertisement

మన మాట్లాడేటప్పుడు అని తప్పు తప్పుగా మాట్లాడటం కంటే నాలుకను కోరుకోవడం మంచిది. నీ జీవితంలో ప్రతిదీ నీ నాలుక మీద ఆధారపడి ఉంటుంది అంటూ పూరి జగన్నాథ్ ఓ పోస్ట్ చేసాడు. ఇందులో నేరుగా బండ్ల పేరు పెట్టకపోయినా ప్రతి ఒక్కరికి తెలుసు… ఇది బండ్లన్న కోసమే పూరి పోస్ట్ చేసాడు అని. అయితే ఈ ఆడియో పంక్షన్ లో బండ్లన్న ఏం మాట్లాడాడో తెలిసిందే. డైలాగులు రానివాళ్లను మెగా స్టార్, సూపర్ స్టార్ చేసావ్. కానీ నీ కొడుకు సినిమా ఫంక్షన్ కు నువ్వు లేవు. వున్ను చేస్తుంది తప్పు అని పూరి జగన్నాథ్ ను విమర్శించాడు బండ్ల.

ఇవి కూడా చదవండి :

ఒక్కపుడు ఐసీసీ అంపైర్.. కానీ ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడు.. ఎందుకు..?

ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కరోనా కేసులు… టెస్ట్ మ్యాచ్ జరిగేనా…?

Visitors Are Also Reading