కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పాన్ ఇండియా లెవల్ లో అభిమానులను సంపాదించుకున్నారు. పునీత్ మరణించిన తరవాత దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులు బాధపడ్డారు. పునీత్ కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. పునీత్ డ్యాన్స్ ను ఫ్యాన్స్ చాలా ఇష్టపడేవారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా ఒకప్పటి స్టార్ హీరోనే….దాంతో నందమూరి ఫ్యామిలీతో పునీత్ కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తాను ఎప్పుడు బెంగుళూరు వెళ్లినా పునీత్ ను కలిసే వాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు.
Also Read: స్వాతి విషయంలో కళ్యాణ్ రామ్ పై హరికృష్ణ ఎందుకు కోప్పడ్డారు…!వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే..?
Advertisement
అంతే కాకుండా పునీత్ చనిపోయిన రోజు బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు పునీత్ ను మర్చిపోలేకపోతున్నారు అంటే ఆయనను ఎంతగా అభిమానించేవారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా హీరోలు ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీమేక్ చేయడం కామన్. అలా పునీత్ కూడా పలు టాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్ లు అందుకున్నాడు.
Advertisement
Also Read: అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు…! కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే..?
అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ హీరోగా పరిచయమైందే తెలుగు సినిమా రీమేక్ తో కావడం విశేషం. రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా రీమేక్ అప్పు తో పునీత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధిచడంతో పునీత్ కు ఎంతో క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా మహేశ్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా ను కూడా కన్నడలో రీమేక్ చేశాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రావాలా సినిమా కన్నడ రీమేక్ లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. పూరీ జగన్నాత్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్టాప్ అయ్యింది. కానీ పునీత్ ఈ సినిమాతో కన్నడనాట బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం పునీత్ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.