Home » VIRAL VIDEO : పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద పునీత్ గన్ మ్యాన్ కన్నీరు ..!

VIRAL VIDEO : పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద పునీత్ గన్ మ్యాన్ కన్నీరు ..!

by AJAY
Ad

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు సన్నిహితులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కన్నడ సీనియర్ హీరో రాజ్ కుమార్ తనయుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే పునీత్ రాజ్ కుమార్ తెలుగు వారికి సైతం ఎంతో సుపరిచితుడు అయ్యారు. చనిపోయే కొద్ది రోజుల క్రితమే తను హీరోగా నటించిన యువ‌ర‌త్న‌ సినిమాను పునీత్ పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు.

puneeth raj kumar

Advertisement

దాంతో ఈ సినిమా తెలుగులోనూ విడుద‌ల‌య్యింది. అలా పునీత్ తెలుగు వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ముఖ్యంగా పునీత్ రాజ్ రాజ్ కుమార్ తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సొంత డబ్బులతో పునీత్ రాజ్ కుమార్ అనాథ పిల్లలకు చదువు చెప్పించ‌డంతో పాటూ చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు.

Advertisement

puneeth rajkumar

puneeth rajkumar

అయితే రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ స‌మాధి వ‌ద్ద‌ నివాళులు అర్పించేందుకు వెళ్లిన ఆయన గన్ మెన్ సమాధి వద్ద కూర్చుని కన్నీరుమున్నీరయ్యారు. చిన్నపిల్లవాడిలా బోరున విలపించాడు. కొద్ది సేపు అక్కడే కూర్చుని ఆ తర్వాత పునీత్ సమాధి వద్దకు వెళ్లి నమస్కారం పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండె తరుక్కుపోయేలా ఉన్న ఈ వీడియోను చూస్తూ పునీత్ అభిమానులు సైతం బాధపడుతున్నారు.

Visitors Are Also Reading