Home » ఐపీఎల్ లో ఆడకపోవడమే మంచి పని అంటున్న పుజారా…!

ఐపీఎల్ లో ఆడకపోవడమే మంచి పని అంటున్న పుజారా…!

by Azhar
Ad

భారత టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా… తాజాగా ఐపీఎల్ పైన షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఐపీఎల్ లో ఆడకపోవడమే మంచి పని అంటున్నాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కు ముందు పుజారా మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఆ ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర అయిన 50 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా పుజారాకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఈ ఏడాది మెగావేలానికి మళ్ళీ పుజారాకు వదిలి వేసింది. అయితే ఈ ఐపీఎల్ 2021 తర్వాత పుజారా దారుణంగా విఫలమవుతూ వచ్చాడు.

Advertisement

అందువల్ల అతను స్పెషలిస్ట్ అనుకున్న టెస్ట్ జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ ఐపీఎల్ ముందు శ్రీలంక తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కు పుజారాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. దాంతో అతడిని ఐపీఎల్ 2022 మెగవేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. అందువల్ల ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఆడటానికి అక్కడికి వెళ్ళాడు పుజారా. అందులో ఆడుతూ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చాడు. కౌంటీలో సెంచరీ, డబల్ సెంచరీలతో చెలరేగిపోయాడు. ఆ కారణంగా ఇప్పుడు మళ్ళీ టీం ఇండియాలో చోటు దకించుకున్నాడు.

Advertisement

ఇక తాజాగా తాను మళ్ళీ జాతీయ జట్టులోకి రావడం పై పుజారా స్పందిస్తూ… నన్ను ఐపీఎల్ లో ఎవరు కొనుగోలు చేయకపోవడమే మంచింది అయ్యింది అంటూ కామెంట్స్ చేసాడు. ఎందుకంటే.. నన్ను ఇప్పుడు ఐపీఎల్ లో ఎవరైనా కొనుగోలు చేస్తే నేను మూడు నెలలు వారితోనే ఉండాల్సి వచ్చేది. అయితే వారు నన్ను తుది జట్టులో ఆడనిచ్చేవారా..? లేదు..? అక్కడ ఉంటె కేవలం నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ కౌంటీలో నాకు నెట్ ప్రాక్టీస్ తో పాటుగా మ్యాచ్ ప్రాక్టీస్ కూడా వచ్చింది అని పుజారా చెప్పాడు. అయితే తాను మాత్రం కేవలం ఇండియా జట్టులోకి తిరిగి రవళి అని మాత్రమే ఆడలేదు అని పుజారా చెప్పాడు. ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడితే చాలు నా ఫోన్ నాకు వస్తుంది అనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు అదే జరిగింది అని పుజారా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

మన టైం కూడా వస్తుంది అంటూ తమ్ముడిని ఓదార్చిన సారా టెండూల్కర్..!

ధావన్ ను ఇంకా ఏం చేయమంటారు చెప్పండి…?

Visitors Are Also Reading