Home » ధావన్ ను ఇంకా ఏం చేయమంటారు చెప్పండి…?

ధావన్ ను ఇంకా ఏం చేయమంటారు చెప్పండి…?

by Azhar
Ad

భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ కు బీసీసీఐ అన్యాయం చేస్తుందని మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడుతున్నారు. భారత జట్టుకు వన్డేల్లో స్థిరమైన ఓపెనర్ గా ఉన్నా శిఖర్ ధావన్ ను టి20 లోకి మాత్రం తీసుకోవడం లేదు సెలెక్టర్లు. 2021 లో శ్రీలంకకు భారత రెండో జట్టు తరపున టీ20 ఆడాడు ధావన్. కానీ తర్వాత ఆడలేదు. తాజాగా సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టి20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కూడా శిఖర్ ధావన్ పేరులేదు అయితే ఇదే విషయంపై రైనా స్పందిస్తూ బీసీసీఐ సెలక్టర్ల పనితీరుపై అసహనం వెలిబుచ్చాడు.

Advertisement

బీసీసీఐ సెలక్షన్ కమిటీ పనితీరుపై రైనా మాట్లాడుతూ… శిఖర్ ధావన్ ను టి20 జట్టులోకి తీసుకోకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కన్సిస్టెన్సీ గా పరుగులు చేస్తున్న ధావన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైనది. ఐపీఎల్ 2022 లో పంజాబ్ కింగ్స్ తరపున 480 పరుగులు చేసాడు ధావన్. అలాగే గత సీజన్లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన ధావన్ ఐపీఎల్ 2020 లో ఆరువందలకు పైగా పరుగులు చేశాడు ఇలా ప్రతి సీజన్లో పరుగులు చేస్తున్నా మాత్రం సెలక్టర్లు పట్టించుకోవడం లేదు ఇటువంటి నిర్ణయాలతో ధావన్ నిరాశ చెందుతాడు.

Advertisement

ఏ కెప్టెన్ అయినా సరే ధావన్ అలాంటి ఆటగాడు జట్టులో ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే… గ్రౌండ్ లోనే కాకుండా గ్రౌండ్ బయటకూడా ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు ధావన్. అలాగే ఎటువంటి టోర్నీలో నైనా సరే ధావన్ తప్పకుండా పరుగులు చేస్తాడు. ఐపీఎల్ 2022 లో రాణిస్తున్నారని దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. ధావన్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని రైనా అన్నాడు. గత నాలుగేళ్లుగా ప్రతి టోర్నీలో పరుగులు చేస్తున్నా… గబ్బర్ సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు అంటే అతను ఇంకా ఏం చేయాలో వారే చెప్పాలి అని పేర్కొన్నాడు రైనా..!

ఇవి కూడా చదవండి :

భారత జట్టులోకి ఎంట్రీపై దినేష్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్…!

మన టైం కూడా వస్తుంది అంటూ తమ్ముడిని ఓదార్చిన సారా టెండూల్కర్..!

Visitors Are Also Reading