బుల్లితెర యాంకర్ రష్మీ ఓ పక్క టీవీ షోలలో.. మరొక పక్క సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపుల్ అయిన ఈ బ్యూటి ప్రస్తుతం చిరంజీవి సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇకపోతే రష్మి గురించి ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : RRR : జక్కన్న భారీ ప్రమోషన్స్ కు స్కెచ్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
Advertisement
రాణిగారి బంగ్లా చిత్ర నిర్మాత నాగలింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్ రికార్డు ఇంకా తన దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు. రాణిగారి బంగ్లా సినిమా చేసేటప్పుడు రష్మీ నాతో చాలా దురుసుగా వ్యవహరించింది. సినిమా సగం షూటింగ్ అయిపోయాక ఓ సాంగ్ చేయాల్సి వచ్చింది. అందులో తాను నటించలేను అని, హీరోను మార్చమని గొడవకు దిగింది. సినిమా సగం షూటింగ్ అయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా.. వినలేదు.
Advertisement
షూటింగ్ క్యాన్సిల్ నేను రానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాకు నాగబాబు తెలుసు. మల్లెమాల శ్యామ్‌ప్రసాద్ రెడ్డి తెలుసంటూ బెదిరించింది. దీంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉంటున్నాను. నీకే కాదు నాక్కూడా అందరూ తెలుసు. షూటింగ్ మధ్యలో ఆపేస్తే నీపై లీగల్‌గా కేసు వేస్తానని.. ఫిల్మ్‌నగర్ గేట్‌కు కట్టేసి కొడతానని చెప్పడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్‌ను పూర్తించింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత ఇలా మాట్లాడొచ్చా.. ఆమెతో అలా నేను మాట్లాడడం కూడా న్యాయం కోసమే. ఇవన్ని పక్కకు పెడితే ఆమె ఓ మంచి నటి. ఏ సీన్‌కు కూడా ఎక్స్ ట్రా టేక్ తీసుకోలేదని ఆ నిర్మాత చెప్పుకొచ్చాడు.
Also Read : “రాధేశ్యామ్” లో బ్లండర్ మిస్టేక్…ఇది కూడా చూసుకోరా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!