Telugu News » RRR : జ‌క్క‌న్న భారీ ప్ర‌మోష‌న్స్ కు స్కెచ్‌.. ఇక ఫ్యాన్స్ కు పండ‌గే..!

RRR : జ‌క్క‌న్న భారీ ప్ర‌మోష‌న్స్ కు స్కెచ్‌.. ఇక ఫ్యాన్స్ కు పండ‌గే..!

by Anji

దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల సినిమా. మూడు ఏండ్ల పాటు మేకింగ్ ప్రాజెక్ట్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆడియ‌న్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు ఇంకా కొద్ది రోజుల స‌మ‌యం ఉంది. మార్చి 25న భారీ ఎత్తున విడుద‌ల‌వుతోంది.

Ads

మార్చి 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ఆర్ గ్రాండియ‌ర్ ప్ర‌మోష‌న్స్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. జాత‌ర‌కు వ‌చ్చిన‌ట్టు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌న్నది జ‌క్క‌న్న మాస్ట‌ర్ ప్లాన్‌. అందుకోసం ట్రిపుల్ టీమ్ ఏమి చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Also Read :  “రాధేశ్యామ్” లో బ్లండ‌ర్ మిస్టేక్…ఇది కూడా చూసుకోరా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!

ముఖ్యంగా తార‌క్, చ‌ర‌ణ్, రాజ‌మౌళి అజ‌య్ దేవ‌గ‌న్‌, ఆలియాభ‌ట్ అభిమానుల‌కు కౌంట్ డౌన్ న‌డుస్తోంది. మార్చి 25న ట్రిపుల్ ఆర్ థియేట‌ర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వ‌చ్చినా ఎగ‌బ‌డి చూస్తున్నారు అభిమానులు. రాజ‌మౌళి సినిమాను ఎంత గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తారో ప్ర‌మోష‌న్లు అంతే తెలివిగా ఎగ్జిక్యూటివ్ చేస్తారు. లేటెస్ట్ గా నెత్తురు మ‌రిగితే ఎత్త‌ర ఎండా సాంగ్ విడుద‌ల అయి ఫ్యాన్స్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. చ‌ర‌ణ్‌, తార‌క్ అలియా భ‌ట్ సై అంటే సై అన్న‌ట్టు పెర్పామెన్స్ తో అద‌ర‌గొట్టారు. ఫ్యాన్స్‌లో పండుగ వాతావ‌ర‌ణం తీసుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య‌తో క‌లిసి రాజ‌మౌళి ఏపీ సీఎంను క‌లిశారు. బెనిఫిట్ షో, పెయిడ్ ప్రీమియ‌ర్ షోల‌తో పాటు టికెట్ ధ‌ర‌ల‌పైన కూడా చ‌ర్చించారు. ఏపీలో నిర్వ‌హించాలనుకుంటున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడిన‌ట్టు స‌మాచారం. ఈ ర‌కంగా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకునేందుకు ఆర్ఆర్ఆర్ విష‌యంలో రాజ‌మౌళి ఎంత సీరియ‌స్ గా వర్క్ చేస్తున్నాడో ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

ఆర్ఆర్ఆర్ పీక్స్‌లో ప్ర‌మోష‌న్స్ చేసారు. ఊహించ‌ని ప‌రిణామాల‌తో వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ రీ ప్ర‌మోష‌న్స్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసింది జ‌క్క‌న్న టీమ్. మార్చి 18న దుబాయ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌, మార్చి 19న క‌ర్నాట‌క‌, చిక్ బ‌ళ్లాపూర్‌లో లార్డ్ స్కేల్ ఈవెంట్‌. 20న హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు ఏపీలో బిగ్ ఈవెంట్‌, ఇంట‌ర్వ్యూస్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ పై గ్లోబ‌ల్ ఆడియ‌న్స్ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. అంద‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్ రీచ్ అయ్యేలా ప్ర‌మోష‌న్స్‌తో పాటు ఈ సినిమాను సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీ అండ్ ఇంగ్లీషు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం బిగ్గెస్ట్ సినిమాగా ఆర్ఆర్ఆర్ ఐ మాక్స్ వెర్ష‌న్‌లో విడుద‌ల కానున్న‌ది. ఈ ర‌క‌మైన విడుద‌ల సౌత్ ఇండియాలోనే సెకండ్ టైమ్ బాహుబ‌లి 2 త‌రువాత ఆర్ఆర్ఆర్ అయితే డాల్బ విజ‌న్‌లో విడుద‌ల చేయ‌డం భార‌త్‌లోనే తొలి సినిమా. సో ట్రిపుల్ ఆర్ విడుద‌ల అయ‌న త‌రువాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల‌ని ఫ్యాన్స్ క్యూరియ‌స్‌గా అభిమానులు చూస్తున్నారు.

Also Read :  చ‌నిపోయేముందు ప్ర‌ముఖ న‌టుడు రంగ‌నాథ్ గోడ‌పై ఏమ‌ని రాశారో తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!


You may also like