ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్లని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ పబ్లిక్ టాయిలెట్ లని ఉపయోగించడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పబ్లిక్ టాయిలెట్లు ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఉపయోగించే ముందు ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి. మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు. మూత్రాన్ని ఆపుకుంటే అనేక రకాల సమస్యలు కలుగుతాయి. అలా అని బయట టాయిలెట్లని వాడడం వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి. పబ్లిక్ టాయిలెట్ల సీట్ల పైన ఎన్నో వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆఫీసులలో, మాల్స్ లేదంటే ఇతర పబ్లిక్ ప్లేస్లలో పబ్లిక్ టాయిలెట్లని వాడితే కచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. సాధారణంగా టాయిలెట్ సీటు పై క్రిములు ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ టాయిలెట్ల మీద అయితే వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా ఉండొచ్చు. ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు వాటి వల్ల కలుగుతాయి. పబ్లిక్ టాయిలెట్ సీట్ల మీద ఉండే బ్యాక్టీరియా కారణంగా విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగవచ్చు.
ఇటువంటి టాయిలెట్ సీట్ల మీద మూడు నిమిషాలు ఉంటే చర్మం పై దద్దుర్లు కలగడం వంటివి కలుగుతాయి. టాయిలెట్ ని ఉపయోగించిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కహాల్ వైప్స్ ని వాడండి. టిష్యూ తీసుకుని శానిటైజర్ తో ముందు టాయిలెట్ సీట్ ని తుడవండి ఆ తర్వాత కూర్చోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
Also read:
- అందంగా ఉందని.. గ్రాండ్ గా పెళ్లి.. బంగారం కూడా.. కానీ ఇంత మోసమా..?
- తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. రూ.500 కి.. కోర్టు వేసిన శిక్ష ఇదే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు