వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. ఈ పెళ్లి అనేది ఏ వయస్సులో చేసుకోవాలో… ఆ వయస్సులో చేసుకుంటేనే బాగుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ బిజీ టెక్నాలజీ ప్రపంచంలో పెళ్లి అనేది అందరికి ఆసల్యం అవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. అందువల్ల అబ్బాయిలకు పెళ్లి అనేది ఆసల్యం అవుతుంటే… అమ్మాయిలకు తాము కోరుకున్నా అబ్బాయి దొరకకపోవడం వల్ల పెళ్లి అనేది ఆలస్యం అవుతుంది. అయితే ఇలా వివాహం ఆలస్యం అయితే చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పు చూద్దాం..!
Advertisement
పెళ్లి అనేది ఆలస్యం కావడం వల్ల పిల్లలు కూడా ఆలస్యంగానే అవుతారు. అలా జరగడం వల్ల… వీరు వృధాప్యంలోకి వచ్చే సమయానికి పిల్లలు సరిగ్గా జీవితంలో సెటిల్ అవ్వకుండా.. ఇంకా వీరి పైనే ఆధారపడుతుంటారు. కానీ విరికేమో వయస్సు మీద పడి పని చేసే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో వీరు పిల్లల పైన ఆధారపడాలి. కానీ వారే సెటిల్ కాకుండా ఉంటె.. ఎవరు ఎవరి మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు ఇంట్లో గొడవలు అనేవి ప్రారంభం అవుతాయి. ఇక ఆ తర్వాత జీవితం మొత్తం సమస్యలతోనే గడుస్తుంది.
Advertisement
ఇక అదే విధంగా ఈ పెళ్లి విషయంలో సర్దుకుపోవాల్సిన వయస్సులో సర్దుకుపోకుండా.. పట్టుబట్టుకొని కూర్చొని.. తర్వాత దయనీయ పరిస్థితుల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. అమ్మాయిలకు అయితే ఒక్కపుడు తన భర్త తనను బాగా చూసుకోవాలి.. బయటకు తీసుకెళ్లాలి.. చీరలు నగలు కొనివ్వాలి అనే కోరికలు ఉండేవి. కానీ ఇప్పుడు వారే ఉద్యోగాలు చేస్తూ.. అవ్వని తమ సొంతంగా సంపాదించుకుంటున్నారు. అందువల్ల తమ కంటే.. ఎక్కువగా సంపాదించే వాడు.. ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండేవాడు భర్తగా రవళి అనుకుంటారు. వారు అనుకునేవాడు దొరకడంలో ఆలస్యం వల్ల.. పెళ్లి చేసుకోవాల్సిన వయస్సు దాటిపోయి.. తర్వాత శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు.
ఇవి కూడా చదవండి :
ధోనిపై మరోసారి విరుచుకుపడ్డ హర్భజన్..!
నేను ఆ ఓవర్ వేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలిచేది..!