Home » ధోనిపై మరోసారి విరుచుకుపడ్డ హర్భజన్..!

ధోనిపై మరోసారి విరుచుకుపడ్డ హర్భజన్..!

by Azhar
Ad
భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ నిలిచిన ధోని పై మరోసారి విరుచుకపడ్డారు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అయితే 2011 ప్రపంచ కప్ క్రెడిట్ మొత్తం ధోనికె దక్కింది అని ఇంతకముందు కూడా చాలాసార్లు కామెంట్స్ చేసాడు భజ్జి. కానీ ఇప్పుడు ఐపీఎల్ విషయంలో ధోనిని టార్గెట్ చేసాడు. ధోని మొదటి నుండి జట్టు కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు వచ్చేది కాదు అని పేర్కొన్నాడు.
అయితే గత ఏడాది చెన్నై జట్టు కెప్టెన్ గా నాలుగో టైటిల్ ను అందించిన ధోని… ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభం సమయంలో కెప్టెన్ గా తప్పుకొని.. ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. కానీ జడేజా అందులో సక్సెస్ కాలేదు. అతని కెప్టెన్సీలో ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం రెండు మాత్రమే గెలవడంతో మళ్ళీ కెప్టెన్ గా ధోనినే వచ్చాడు. ఇక ధోని వచ్చిన తర్వాత ఆడిన 5 మ్యాచ్ లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది చెన్నై.
దాంతో ఈ కెప్టెన్సీ మార్పుపై హర్భజన్ మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ 2022 మొదటి నుండి ధోనినే కెప్టెన్ గా ఉన్న చెన్నై జట్టు పెద్దగా మ్యాచ్ లు గెలవలేకపోయేది. ఎందుకంటే.. ఈ ఏడాది ఆ జట్టులో సరైన ఆటగాళ్లు లేరు. ఉన్న బౌలర్లు, బ్యాటర్లు అందరూ విఫలమవుతున్నారు. కాబట్టి చెన్నై ఓడిపోయింది. ఒకవేళ ధోని కెప్టెన్సీలో గెలిచేదే అయితే ఈ 5 మ్యాచ్ లలో ఎందుకు మూడు ఓడిపోయింది అని హర్భజన్ అన్నాడు. ఈ ఏడాది ఆ జట్టులో దీపక్ చాహార్, డు ప్లెసిస్, రైనా వంటి ఆటగాళ్లు లేకపోవడంతో ఆ జట్టు ఓడిపోతుంది.. ధోని మొదటి 8 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉన్న ఇదే జరిగేది అని భజ్జి పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading