టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కలిసి ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలతోనే ఎంతో ఎత్తుకి ఎదిగాడు. అతనికి బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆ కారణంగానే పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చుస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
Advertisement
అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఇదే కాంబినేషన్ లో మరో సినిమా అనేది అనౌన్స్ అయ్యింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పటి నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పే జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ టోన్ ఓ క్రేజ్ అలాగే అంచనాలు అనేవి ఏర్పడాయి. ఇక ఈ సినిమాలో విజయ్ కి జంటగా పూజా హేగ్దే నటిస్తుంది అని తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ ఇప్పటివరకు కనిపించని ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Advertisement
కానీ ఈ సినిమా అనేది వివాదాల్లోకి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమా యొక్క కథ. అయితే ఈ సినిమాలో సైనిక పాలన అనేది చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ప్రభుత్వం లేన్నపుడు సైనికులు తమ దేశం కోసం ఏం చేస్తారు అనే అంశంలో ఈ సినిమా కథ సాగనుంది అని సమాచారం. అయితే ఈ సైనిక పాలన అనేది వివాదాస్పద అంశం అనేది అందరికి తెలుసు. అందుకే ఈ సినిమా అనేది విడుదల అయిన తర్వాత దీని పై చాలా వివాదాలు అనేవి వస్తాయి… విడుదలకు ముందే కూడా చాలా సమస్యలు అనేవి తప్పవు అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :