క్రికెట్ లో అతి పెద్ద టోర్నీ వన్డే వరల్డ్ కప్. నాలుగేళ్లకోసారి వచ్చే ఆ మెగా టోర్నీ కోసం ఆటగాళ్లు, అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కెరీర్ లో ఒక్కసారైనా వరల్డ్ కప్ ను గెలవాలని ప్రతి ఒక క్రికెటర్ కలలు కంటూ ఉంటారు. అలాంటి వన్డే వరల్డ్ కప్ మళ్లీ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అయింది. వచ్చే నెల 5 నుండి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న అంశం కప్పు ఎలా తయారు చేస్తారు? దాని ధర ఎంత అని. అంతర్జాతీయ క్రికెట్ లో ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ 1975లో ప్రారంభమైంది.
ఇంగ్లాండ్ లో జరిగిన మొదటిప్రపంచ కప్ ను అప్పటి వెస్టిండీస్ జట్టు గెలుచుకుంది. అప్పటి కప్పుకు ప్రెడెన్షియల్ వరల్డ్ కప్ గా పేరు పెట్టారు. ఎందుకంటే ఆ మెగా టోర్నీని ప్రెడెన్షియల్ అనే బీమా కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ మొదటి వరల్డ్ కప్ ను బంగారం, వెండితో తయారుచేశారు. కప్పు పైభాగంలో బంగారు పూతతో పూసిన బంతిని పెట్టారు. 1979లో 1983లో కూడా అదే కప్పు నీ స్పాన్సర్ చేసింది. ఇంకా 1987 వరల్డ్ కప్ ను రిలయన్స్ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ కప్పు కూడా బంగారం, వెండితో తయారుచేశారు. ఇంకా 1999 వన్డే వరల్డ్ కప్ నుండి ఐసీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కు ఐసిసి ఒక కొత్త కప్పును తయారు చేసింది. ఈ ట్రోఫీని లండన్ లోని గారార్డ్ అనే ప్రముఖ జ్యువెలరీ సంస్థ తయారు చేసింది. వెండితో తయారుచేసిన ఈ కప్పులో పైనుంచి బంగారు పూత పోశారు. 60 సెంటీమీటర్లు ఉండే ఈ కప్పు పైన గ్లోబ్ ఉంటుంది. అది బంగారు రంగులో ఉంటుంది. ఈ గ్లోబల్ సపోర్ట్ గా మూడు పిల్లర్లు ఉంటాయి.
Advertisement
Advertisement
ఇది స్టెప్స్ ఆకారంలో ఉండేలా తయారు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లను తెలిపేలా ఈ కప్పు తయారయ్యింది. వరల్డ్ కప్ ను ప్రత్యేక కొలతలతో తయారు చేయడంతో ఏ వైపు నుండి చూసి ఒకేరకంగా కనిపిస్తుంది. ఈ కప్పు మొత్తంగా 11 కిలోల బరువుతో ఉంటుంది. ఈ కప్పుకు ఐసీసీ 30 లక్షల 85 వేల 320 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇక విజేతగా నిలిచిన జట్టుకు కప్పును అందిస్తారు. అలాగే విజేత టీం పేరును కప్పు కింద రాస్తారు. నమూనా కప్పును మాత్రమే జట్లకు ఇస్తారు. అసలు కప్పు మాత్రం ఐసిసి దగ్గర ఉంటుంది. గత వరల్డ్ కప్ ఇంగ్లాండ్ గెలుచుకోగా… ఈ ఏడాది ఇండియాలో ఈవెంట్ జరుగుతుండడంతో భారత్ కప్పు కొడుతుందని భావిస్తున్నారు. అయితే.. ఈ సారి విజేతకు 33 కోట్ల 17 లక్షలు అందిస్తారు. రన్నరప్ కు 16 లక్షలు ఇస్తారు.
ఇవి కూడా చదవండి
- యాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?
- బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు…కానీ YSR కాపాడారు – పోసాని సంచలనం
- Anasuya : పెళ్ళికి ముందు 8 ఏళ్ళు అతనితో అనసూయ సహజీవనం…కులం కూడా తెలియదట !