Home » ఆర్ఆర్ఆర్ త‌మిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్…నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

ఆర్ఆర్ఆర్ త‌మిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్…నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

ఆస్కార్ వ‌చ్చిన నాటి నుండి ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమాకు జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలాయా భ‌ట్ న‌టించగా ఎన్టీఆర్ కు జోడీగా ఓలీవియా న‌టించింది. అదేవిధంగా సినిమాలో అజ‌య్ దేవ్ గ‌న్, శ్రీయ‌లు ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించారు.

priyanka chopra

priyanka chopra

ఇక ఈ సినిమాకు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు రావ‌డంతో పాటూ ఆస్కార్ రావ‌డంతో ప్ర‌పంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తోంది. అయితే కొంత‌మంది మాత్రం ఆర్ఆర్ఆర్ ను త‌మిళ సినిమా అనుకుంటున్నారు.

Advertisement

Advertisement

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఓ ఇంట‌ర్వ్యూ లో అలా అనుకున ప‌ప్పులో కాళు వేసింది. ఆర్ఆర్ఆర్ చిత్ర భృంధం అమెరికాకు వెళ్లిన‌ప్పుడు ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ లోని త‌న ఇంట్లో చిత్ర యూనిట్ కు పార్టీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఆస్కార్ వేడుక‌ల్లో ప్రియాంక కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ తో అంత క్లోజ్ గా గ‌డిపిన ప్రియాంక రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆర్ఆర్ఆర్ ను త‌మిళ సినిమా అని చెప్ప‌కొచ్చింది. బాలీవుడ్ కొంద‌రి చేతుల్లోనే ఏకీకృతం అయి ఉండేద‌ని కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని చెప్పింది. అదే స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూ చేస్తున్న వ్య‌క్తి ఆర్ఆర్ఆర్ ప్ర‌స్తావన తీసుకురాగా అది త‌మిళ సినిమా అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు హీరోయిన్ కామెంట్స్ వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్ లు ప్రియాంక చోప్రాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ :విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

Visitors Are Also Reading