Home » నన్ను అభినదించడం లేదంటూ భాదపడుతున్న పృథ్వీ షా..!

నన్ను అభినదించడం లేదంటూ భాదపడుతున్న పృథ్వీ షా..!

by Azhar
Ad

22 ఏళ్ళ పృథ్వీ షా చాలా త్వరగా 2018 లో టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంచనాలకు తగ్గట్లుగానే మొదటి టెస్టులోనే శతకం చేసిన పృథ్వీ షా ఆ తర్వాత మాత్రం వరుసగా విఫలం అవుతూ వచ్చి.. జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఆ తర్వాత ఆడిన రంజీలో ఐపీఎల్ లో రాణించిన పృథ్వీ షాకు మాత్రం ఇండియా జట్టులో చోటు దక్కలేదు. ఈ నెలలో ఐర్లాండ్ కు వెళ్లనున్న రెండో భారత జట్టులో కూడా పృథ్వీ షాకు అవకాశం ఇవ్వలేదు బీసీసీఐ సెలక్టర్లు. అయితే రంజీల్లో ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవరించే పృథ్వీ షా తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే రంజీ ఫైనల్స్ లో ముంబై – మధ్య ప్రదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్ కు ముందు పృథ్వీ షా తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ… ఈ రంజీ సీజన్ లో నేను మూడు అర్ధ శతకాలు చేశాను. కానీ నా బ్యాటింగ్ నాకే నచ్చడం లేదు. అయితే మాములుగా హాఫ్ సెంచరీ చేసిన ఏ ఆటగాడు అయిన ఔట్ అయిన తర్వాత డ్రెసింగ్ రూమ్ కు వస్తే అందరూ అభినందిస్తారు. కానీ నేను 50 కొట్టి వస్తే మాత్రం నన్ను ఎవరు అభినందించడం లేదు అంటూ నవ్వుతు చెప్పాడు.

Advertisement

ఇక అదే విధంగా ఓ క్రికెటర్ జీవితంలో పైకి లేవడం.. కిందకు పడిపోవడం చాలా సాధారణమైన విషయం అని పృథ్వీ షా చెప్పాడు. ఇక నేను నా గురించి మాత్రమే కాకుండా మొత్తం జట్టు గురించి ఆలోచించాలి. అలాగే నేను తిరిగి తన పాత ఫామ్ లోకి రావడానికి కేవలం ఒక్క మ్యాచ్ చాలని పేర్కొన్నాడు. ఇక భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం పై ప్రశ్నించగా.. ప్రస్తుతం నేను ఆ విషయం గురించి ఆలోచించడం లేదు అని పేర్కొన్నాడు. ఇప్పుడు నేను నా జట్టును రంజీ విజేతగా నిలపడం పైనే ఫోకస్ పెట్టాను అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

పంత్ కు కెప్టెన్సీ అప్పుడే ఇవ్వాలి…!

మ్యాచ్ కంటే ముందే మొదలైన ఇండియా – ఇంగ్లాండ్ వార్… ఎలా అంటే…?

Visitors Are Also Reading