Home » Video Viral : రాత్రి వేళ రైల్వే స్టేష‌న్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

Video Viral : రాత్రి వేళ రైల్వే స్టేష‌న్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శుక్ర‌వారం రాత్రి వార‌ణాసిలో ప‌ర్య‌టించారు. ముఖ్యంగా ఉన్న‌ట్టుండి అక‌స్మాత్తుగా వార‌ణాసిలో కాంట్ రైల్వే స్టేష‌న్‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డ ఉన్న దుకాణ‌దారుల‌తో మాట్లాడారు. అంతేకాదు రైల్వే స్టేష‌న్‌ల‌లో ఉన్న ప్ర‌యాణికుల‌తో కూడా ప్ర‌ధాని మాట్లాడారు. అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోడీని చూసి నినాదాలు చేశారు. మోడీ మోడీ అని స్లోగ‌న్స్ ఇచ్చారు. ఆ రైల్వేస్టేష‌న్ అంతా ఒక్క‌సారిగా సంద‌డిగా మారింది.

Advertisement

Advertisement

 

పీఎం న‌రేంద్ర మోడీ వార‌ణాసి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం. శుక్ర‌వారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చివ‌రి ద‌శ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వార‌ణాసిలో భారీ రోడ్డు షో నిర్వ‌హించారు. ప్ర‌జ‌లు రోడ్డు షోలో ఉత్సాహంగా పాల్గొని నినాదాల చేశారు. ముఖ్యంగా యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓ అరుదైన దృశ్యం క‌నిపించింది. ప్ర‌ధాని మోడీ సాధార‌ణ వ్య‌క్తి మాదిరిగా ఓ టీ స్టాల్‌కు వెళ్లి చాయ్ తాగారు. టీ స్టాల్‌కు వెళ్లిన మోడీ మ‌ట్టి గ్లాస్‌లో ఇచ్చిన చాయ్ తాగుతూ కాసేపు సేద తీరారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇవాళ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీ ఈ నెల 07న తుది ద‌శ పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. చివ‌రి విడ‌త‌లో వార‌ణాసితో పాటు దాని చుట్టు ప‌క్క‌ల ఉన్న 8 జిల్లాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన మార్చి 10న ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయి.

 

Visitors Are Also Reading