ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఇరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. రష్యాతో ఓ వైపు పోరు కొనసాగిస్తూనే.. నేరుగా చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్ స్కీని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభినందించారు. ఇక ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో అందించిన సాయానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి బ్రేకప్ వరకూ అసలేం జరిగింది..!
Advertisement
Advertisement
ఇంకా కొందరూ భారతీయ పౌరులు ఉక్రెయిన్ లో ఉన్నారు. రష్యా కాల్పులు విరమణ ప్రకటించిన తరుణంలో సుమి నుంచి మిగతా భారతీయుల తరలింపునకు సహకారమందించాలని ప్రధాని కోరారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మోడీ ఫోన్ లో మాట్లాడనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
PM Modi speaks to Ukraine's Zelensky, seeks support in evacuation of Indians from Sumy
Read @ANI Story | https://t.co/tRYc1gZr3F#PMModi #IndiansInUkraine #Zelensky #UkraineRussiaCrisis pic.twitter.com/KhJjTVzb4f
— ANI Digital (@ani_digital) March 7, 2022