ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ప్రభాస్ పక్కన ఒక్క ఛాన్స్ వస్తే చాలనుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇక ప్రభాస్ ఎంత మంచి వాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Advertisement
ఎంతఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ప్రభాస్ ది. లక్షల్లో అభిమానులు ఉన్నా పాన్ ఇండియా స్టార్ అయినా ఎప్పుడూ పొంగింపోడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతాడు. గర్వం అనేదే ప్రభాస్ ముకంలో ఎప్పుడూ కనిపించదు. అంతే కాకుండా ఒకప్పుడు స్టార్ డమ్ లేదనే కారణం తో ప్రభాస్ ను ఓ సినిమా నుండి తొలగించినా సరే ఆ సినిమా ఆడియో లాంఛ్ కు గెస్ట్ గా వెళ్లి చిత్రయూనిట్ ను అభినందించాడు.
Advertisement
వెంకటేష్ హీరో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో గర్షణ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ఆసిన్ స్కూల్ టీచర్ పాత్రలో నటించి మెప్పించింది. 2004లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది. పోలీస్ పాత్రలో వెంకటేష్ అదరగొట్టాడు.
సినిమాలోని పాటలు స్క్రీన్ ప్లే, వెంకటేష్ ఆసిన్ ల నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాకు మొదట ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేశారు. అంతే కాకుండా పూజకార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. కానీ ప్రభాస్ కు క్రేజ్ తక్కువగా ఉందన్న కారణంతో పక్కన పెట్టి వెంకటేష్ ను హీరోగా ఎంపిక చేశారట. అయినప్పటికీ ప్రభాస్ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో సందడి చేసి చిత్రయూనిట్ ను అభినందించాడు. ఇక ఈ సినిమా మిస్ చేసుకున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఇంతకంటే గొప్ప సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారిపోయాడు.
ALSO READ : “జబర్దస్త్” కామెడీ షోలో కట్టుకున్న చీరలను ఆ తరవాత ఏం చేస్తారో తెలుసా…?