Home » సెన్సార్ బోర్డుపై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. అందుకోసమేనా ?

సెన్సార్ బోర్డుపై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. అందుకోసమేనా ?

by Anji
Ad

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా “సలార్” థియేటర్లలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. తాజాగా విడుదల చేసిన సలార్ సెకండ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలకు ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సెన్సార్ బోర్డుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇటీవల “సలార్” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన విషయం తెలిసిందే. కానీ సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఎవరు ఊహించని విధంగా ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా “సలార్” మూవీకి ఏ సర్టిఫికెట్ రావడం పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలలో ప్రశాంత్ అదే విషయాన్ని వెల్లడించాడు. “సలార్” మూవీ ప్రమోషన్లలో భాగంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిత్ర యూనిట్ ను ఇంటర్వ్యూ చేశారు.  ఇందులో రాజమౌళి ప్రశ్నలు అడుగుతూ హోస్ట్ గా మారారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్, మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సెన్సార్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను రాజమౌళితో పంచుకున్నాడు ప్రశాంత్. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ “సలార్” మూవీకి ఏ రేటింగ్ ఎందుకు ఎంచుకున్నాడు అనే కారణాన్ని వెల్లడించారు. సెన్సార్ అధికారులు అప్పటికే సినిమాలో చాలా కట్స్ చెప్పారని, వాటన్నిటిని కట్ చేయడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ సినిమాపై ఇంపాక్ట్ పడే కొన్ని ప్రత్యేకమైన షాట్ లను మాత్రం తొలగించడం తమకు ఇష్టం లేదని, ఎందుకంటే ఆ సన్నివేశాలను తొలగిస్తే సినిమాపై గట్టి ఎఫెక్ట్ పడుతుందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా అసభ్యకరంగా లేకపోయినా ఏ సర్టిఫికెట్ ఇవ్వడం తనను నిరాశకు గురి చేసిందని అన్నారు ప్రశాంత్ నీల్.    ఈ మూవీలో కేవలం అవసరమైన వైలెన్స్ మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు సెన్సార్ సభ్యులు ఎక్కువ కట్స్ చెప్పడం, అలాగే ఎఫెక్టివ్ సన్నివేశాలను తొలగించడం కోరుతున్నారని ప్రభాస్ కు చెప్పినప్పుడు ఆయన ఏ సర్టిఫికెట్ తీసుకోమని సలహా ఇచ్చాడట. దీంతో తాను కూడా ఓకే చెప్పాను.   ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాలకు ఏ సర్టిఫికెట్ వస్తుంది. ఇటీవల వచ్చిన యానిమల్ కూడా ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ఆ సినిమాకు తేడా ఉన్నప్పటికీ వైలెన్స్ మాత్రం కామన్ కదా. కాబట్టి “సలార్” మూవీకి వచ్చిన ఏ సర్టిఫికెట్ వచ్చిన అది ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading