మామూలుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలను సామాన్య ప్రజలు ఫాలో అవుతుంటారు. సెలబ్రెటీలు, సామాన్య ప్రజలను ఫాలో అయ్యారంటే అది చెప్పుకోదగిన విషయమే. ఎందుకు అంటే సామాన్య ప్రజల్లో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటేనే సెలబ్రెటీలు ఫాలో అవుతున్నారు.
Advertisement
ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాంటి వారు హోదాలో ఉన్న వ్యక్తులు సామాన్య ప్రజలను ఫాలో అయ్యారంటే వారు ఏదో ఓ ప్రత్యేకత కలిగి ఉండొచ్చని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే భారత ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ఒక సామాన్య యువతిని ఫాలో చేసారు. ఇందుకు కారణం ఈ అమ్మాయి తన ప్రత్యేకతతో మోడీని ఫిదా చేయడమే. ఆ యువతి పేరే ప్రజ్ఞా కశ్వప్..!మైసూర్‌కు చెందిన ఈ అమ్మాయిని మోడీ ఇటీవలే ట్విట్టర్‌లో ఫాలో చేయడం ప్రారంభించారు.
Advertisement
22 ఏళ్ల ప్రజ్ఞ ప్రస్తుతం లా కోర్సు చేస్తున్నది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి పరులకు సాయం చేయాలనే సేవాభావాన్ని పుణికి పుచ్చుకుంది. అలా పదేండ్ల ప్రాయంలోనే చాలా జాతీయ స్థాయి సేవా కార్యక్రమాల్లో భాగమై తన గొప్ప మనసుని చాటుకుంది. ప్రజ్ఞ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాజాగా ప్రజ్ఞ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి తాతయ్యలిద్దరి వల్లనే తనకు సమాజ సేవపై మిక్కిలి ఎక్కువ పెరిగిందని చెప్పుకొచ్చింది ప్రజ్ఞ.
ప్రకృతి వైపరిత్యాల సమయాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ఎందరో ప్రజలకు తన సేవలను అందిస్తుంది. అదేవిధంగా పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు బోధిస్తుంది. ప్రజ్ఞ క్లాసికల్ డ్యాన్స్ లో నిష్ణాతురాలు. ఇప్పటికే ఆమె చాలా వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.ప్రజ్ఞ వీణ వాయించడంలో తన చేతితో సృజనతో బొమ్మలు గీయడంలో కూడా దిట్ట. అదేవిధంగా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈమెలోని నైపుణ్యాలను సేవా గుణాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ఫిదా అయిపోయి ఫాలో చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోడీ కూడా ఈమె సేవలను మెచ్చి ఫాలో చేసారు. వాస్తవానికి ప్రజ్ఞ మోడీ నా స్పూర్తి అంటుంటుంది. తాజాగా ఆయన ఫాలో కావడంతో ప్రజ్ఞ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. మోడీ నన్ను ట్విట్టర్‌లో ఫాలో అయ్యారు. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. ధన్యవాదాలు సర్. మీరు నా ఫెవరెట్ లీడర్ మాత్రమే కాదు నా స్పూర్తి ప్రదాత కూడా అని ప్రజ్ఞ ట్విట్టర్‌లో వెల్లడించింది.