టాలీవుడ్ నటి ప్రగతి గురించి తెలియని వారుండరు. కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నటి ప్రగతి తన కూతురుతో జీవితాన్ని గడిపేస్తుంది.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
Advertisement
కాగా పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి అప్పటికే ఓ పాపకి బాబుకి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా పాట్లు కూడా పడింది. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలి అన్నది పిల్లల ఉద్దేశం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లి చేయడానికి పిల్లలు తెగ ట్రై చేస్తున్నారట.
Advertisement
READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!
అయితే ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ తెలుస్తుంది. కాకపోతే ఆమె ఆలోచనకు తగ్గట్టు ఉండే వ్యక్తి దొరికితే అందరికీ హ్యాపీగానే ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఇదివరకే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న పిక్స్ ని ట్రెండ్ చేస్తూ అతగాడిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే నిజానికి ప్రగతి రెండో పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఇంకా ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు.
READ ALSO : ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?