ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాల కథలు పోయి పాత సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం.. ఇప్పటికే పోకిరి సినిమా రిలీజ్ అయ్యి అందరిని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ టైం మొదలైంది. మిర్చి మూవీ మరోసారి థియేటర్లపై దండయాత్ర చేసేలా కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎందుకు పాత సినిమాల కొత్త సందడి అనేది చూద్దాం.. మహేష్ బాబు,ప్రభాస్,పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాలు థియేటర్ లోకి వస్తే ఏమవుతుంది. థియేటర్లన్నీ కళకళలాడుతాయి. అవేమి కొత్త సినిమాలు అయితే కాదు.. ఇప్పటికే రిలీజ్ అయిన పాత సినిమాలు.. హిట్ అవ్వాల్సిన పనిలేదు.
Advertisement
ఆల్రెడీ విజయవంతమైన సినిమాలే థియేటర్లలో సందడి చేస్తే ఇంకెలా ఉంటుంది.. ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తోంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీ జల్సా ను 4కే లోకి చేంజ్ చేసి పవన్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు, వినోదయ సీతం సినిమాలు షూటింగ్ పూర్తయి విడుదల అవ్వాలంటే ఇంకా చాలా రోజులు పట్టవచ్చు. అందుకే ఈ లోపు ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ హిట్ మూవీ జల్సా ను రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇలాంటి ప్రయత్నమే సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో కూడా జరిగింది. మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి తన క్రేజ్ నే మార్చిన సినిమా పోకిరి.
Advertisement
అందుకే ఆ ప్రాజెక్టుని 4కె లో మార్చి రీ రిలీజ్ చేసి సందడి పెంచారు. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో వారి యొక్క పాత సినిమాలే ప్రీ రిలీజ్ చేయడం కోసం సినిమా ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హిట్ మూవీ రిలీజ్ కాబోతోంది. మిర్చి మూవీ అక్టోబర్ 23 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆ ఒక్క రోజే వెయ్యి థియేటర్లలో ఈ సినిమా రాబోతోంది. పోకిరి,జల్సా 4కె టెక్నాలజీలోకి కన్వర్ట్ చేసినట్టు మరి ఈ సినిమాను ఏ టెక్నాలజీకి కన్వర్ట్ చేస్తారో వేచి చూడాలి.
ALSO READ;
అల్లుఅర్జున్ సతీమణి ఫోటోలపై కళ్యాణ్ దేవ్ ఆసక్తికరమైన కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్..!
నాగబాబుకు తెలియకుండా నిహారిక ఇంత పని చేసిందా.. కోపంతో రగిలిన నాగబాబు ఏం చేశారంటే..?