ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు పెళ్లి చేసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో పేరు సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం పెళ్లిపై ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ప్రభాస్ అభిమానులు యంగ్ రెబల్ స్టార్ నుంచి ఎప్పుడెప్పుడు పెళ్లి శుభవార్త వింటామా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ వివాహ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
Advertisement
ఈ తరుణంలోనే యంగ్ రెబల్ స్టార్ వివాహ విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని శుభవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. యంగ్ రెబెల్ స్టార్ అభిమాన సంఘం మొగల్తూరు అధ్యక్షులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే ప్రభాస్ వివాహం జరగనుందని ఈ విషయాన్ని వెల్లడించారు. పెళ్లి కూతురు కూడా ఫిక్స్ చేశారని, తెలియజేశారు. అయితే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి కృష్ణంరాజు ఫ్యామిలీ కి చాలా దగ్గరి కుటుంబం నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
అయితే ఈ విషయంపై గత కొన్ని రోజుల క్రితం కృష్ణంరాజు కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియజేశారు. ఈ తరుణంలోనే ఆయన పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసరని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ప్రభాస్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సలర్ మరియు ఆదిపురుష్ మూవీస్ తో ముందుకు రాబోతున్నారు.
also read;
ఆర్ఆర్ఆర్ సినిమాలో డిలీట్ చేసిన ఎన్టీఆర్ మూడు సీన్లు ఇవే…!
“ఆరుగురు ప్రతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?