Home » “ఆరుగురు ప్రతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

“ఆరుగురు ప్రతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే నటీనటులు ఒక్కసారే ఓవర్ నైట్ లో మంచి పేరు తెచ్చుకుంటారు. అలా ఒక్కసారి స్టార్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్లీ కనపడకుండా తెరమరుగు అయిపోతారు.

Advertisement

దీనికి ప్రధాన కారణం వారి లోపల ఎంత టాలెంట్ ఉన్నా కానీ అదృష్టం అనేది కొంత కూడా కలిసి రాదు. కొంతమందేమో వరుస ఫ్లాప్ లతో వరుసగా సినిమాలు చేస్తూనే హిట్టు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈ నటి కూడా అదే కోవకు చెందినది.. మరి ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆరుగురు ప్రతివతలు సినిమా లో మెయిన్ రోల్ పోషించిన నటి అమృత. అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందినది. ఈమెను దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఆయన దర్శకత్వం వహించినటువంటి ఆరుగురు ప్రతివతలు మూవీ ద్వారా ప్రేక్షకులకు అమృత ను పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.. డైరెక్టర్ ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం ఆషామాషీ విషయం కాదు. ఈ మూవీ చూస్తే చూస్తున్నంత సేపు అనేక ట్విస్టులు ఏదో తెలియని ఉత్కంఠ మనలో రేపుతుంది. ఇలా సినిమా రావడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై వస్తే మాత్రం చాలామంది చూస్తూ ఉంటారు. ఇందులోని కొన్ని సీన్లకు మాత్రం అట్రాక్ట్ అయిపోతారు అని చెప్పవచ్చు. ఈ మూవీలో ముఖ్యపాత్రల్లో అమృత, నేత, విద్య, ఎల్బీ శ్రీరామ్, రవి వర్మ, తిరుపతి రావు వంటి నటులు నటించారు.

Advertisement

ఇంత మంది నటులు ఉన్న అమృత మాత్రం తన నటనతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తను పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే వేరొకరితో సంబంధం పెట్టుకొని తన సంసారాన్ని సాగించే వివాహిత పాత్రలో నటించి మెప్పించింది. మెప్పించడమే కాదు ఆ పాత్రకు ఎంతో మంది మంత్రముగ్ధులయ్యారు. కానీ మూవీ తర్వాత ఎంతో పేరు తెచ్చుకున్న అమృత తర్వాత ఏ మూవీలో కనిపించలేదు. ఈమెను అలాంటి పాత్రలో చూసిన ప్రేక్షకులు మళ్లీ అమృతని అదే పాత్రలో ఊహించుకుంటారు తప్ప వేరే పాత్ర ఇస్తే ఒప్పుకోరని అవకాశాలు రాలేదని తెలుస్తోంది. అయితే ఈ మూవీ తరువాత కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తర్వాత కొంతకాలానికి వివాహం చేసుకొని అమెరికాలో చేయకూడని తప్పు చేసి కేసులో ఇరుక్కున్నట్లు కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం అమృత బెంగళూరులో నివాసం ఉంటుందని తెలుస్తోంది.

also read;

ఈ హీరోల మ‌ధ్య ఉన్న పోలిక‌లను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..?

ఆ తప్పు వల్లే జయప్రద తెలుగు సినిమాలకు దూరం అయ్యిందా..?

Visitors Are Also Reading