Home » 16 రోజులకు ప్రభాస్ సలార్… ఎంత కలెక్ట్ చేసింది అంటే..?

16 రోజులకు ప్రభాస్ సలార్… ఎంత కలెక్ట్ చేసింది అంటే..?

by Sravya
Ad

ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా మంచి హిట్ అయింది బాహుబలి సినిమా తర్వాత అంత హిట్ వచ్చిన సినిమా సలార్. కేజిఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకి దర్శకత్వం వహించారు యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెర మీదకి ఎక్కింది. సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా లో ప్రభాస్ తన యాక్షన్ తో అదరగొట్టేసారు. సలార్ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. ఒక పార్ట్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై సలార్ సినిమా ని విజయ్ కిరంగదూర్ గ్రాండ్ గా నిర్మించారు.

Advertisement

Advertisement

పార్ట్ 2 మీద కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. ప్రభాస్ తన స్టామినా ని ఈ మూవీ తో మళ్ళీ ప్రూవ్ చేసాడు. పైగా సలార్ సినిమా ని చూసి ఫ్యాన్స్ కూడా ఖుష్ అయ్యిపోయారు. ఈ సినిమా ఇప్పటికి కూడా బానే కలెక్షన్ల ని రాబడుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది ఇప్పటికే కొన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లు ని సలార్ సినిమా రాబడుతోంది. ఇక సినిమా 16 రోజుల కలెక్షన్ల వివరాలను చూద్దాం.

నైజాం 70.53 కోట్లు, సీడెడ్ 21.24 కోట్లు, గుంటూరు 9.13 కోట్లు, కృష్ణా 7.18 కోట్లు, ఉత్తరాంధ్ర 16.74 కోట్లు, ఈస్ట్ 9.52 కోట్లు, వెస్ట్ 6.98 కోట్లు, నెల్లూరు 4.67 కోట్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణ కలిపి 145.99 కోట్లు రాగా, కర్ణాటక 22.10 కోట్లు, తమిళ నాడు 11.20 కోట్లు, హిందీ 60.17 కోట్లు, కేరళ 6.73 కోట్లు, ఓవర్సీస్ 63.95 కోట్లు వచ్చాయి. రూ.315.94 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.22.06 కోట్ల షేర్ రావాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading