Home » ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ప్రభాస్ రూ. 1 కోటి విరాళం..

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ప్రభాస్ రూ. 1 కోటి విరాళం..

by Bunty
Ad

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు టాలీవుడ్ హీరోలు అండ‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోలు ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌గా… తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ముందుకు వ‌చ్చాడు. తాజాగా హీరో ప్ర‌భాస్ కూడా కోటి రూపాయ‌లు విరాళం అందిస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. గ‌తంలో కూడా ప్ర‌భాస్ భారీగానే విరాళాలు అంద‌జేశారు. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో… కూడా కోటి రూపాయ‌లు అందించారు.

Advertisement

Advertisement

ఇక క‌రోనా స‌మ‌యంఓ ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవ‌స‌రం అనుకున్న ప్ర‌తీసారి ప్ర‌భాస్ త‌న గొప్ప మ‌న‌సు చాటు కుంటూనే ఉన్నారు. హీరో ప్ర‌భాస్‌.. పెద్ద మ‌న‌సుకు అభిమానుల‌తో పాటు అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌ద బాధితుల‌కు… హీరో ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, చిరంజీవి లాంటి టాలీవుడ్ న‌టులు… ఆర్థిక స‌హాయం అందించారు. అటు తెలుగు దేశం పార్టీ, వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఆర్థిక స‌హాయం చేస్తోంది. ఇళ్లు కోల్పోయిన వారికి… నూత‌న ఇండ్లు ఇచ్చేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ముందుకు వ‌చ్చింది. అలాగే.. ప్రాణాలు కోల్పోయిన వారి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తోంది స‌ర్కార్‌.

Visitors Are Also Reading