పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
Advertisement
ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ కు బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది. దాంతో బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇక తెలుగు చిత్రసీమకు కూడా ఈ సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న సంగతి ఒప్పుకోవాల్సిన నిజం.
అయితే రెబల్ స్టార్ కృష్ణం రాజు నటవారసుడిగా ఇంటస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో మాత్రం ఇబ్బందులు ఎదురుకున్నాడు. వరుసగా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ ప్రభాస్ రెండో సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తో 100 రోజులు ఆడటం చెప్పుకోదగ్గ విషయం.
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రభాస్. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించకపోయినా ప్రభాస్ అంటే ఎవరు అనేది మాత్రం తెలుగుప్రేక్షకులందరికీ తెలిసిపోయింది. ఈశ్వర్ తరవాత ప్రభాస్ నటించిన సినిమా రాఘేవేంద్ర అయితే ఈ సినికు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది.
Advertisement
Also Read: Viral Video నువ్వా.. నేనా..? వార్నర్ Vs షాహీన్ అప్రిదీ
కానీ తీరా చూస్తూ ఈ సినిమా ఏకంగా 3,4 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరవాత ప్రభాస్ హీరోగా నటించిన మూడో సినిమా వర్షం. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మైలురాయిగా మారింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు అయ్యారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా తరవాత అడవిరాముడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తో మొదలైంది. కానీ వంద రోజులు ఆడింది. ఆ తరవాత ప్రభాస్ హీరోగా యోగి సినిమా వచ్చింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఇది కూడా కొన్ని కేంద్రాలలో వంద రోజులు ఆడింది. అంతే కాకుండా ప్రభాస్ వంశీపైడిపల్లి కాంబోలో వచ్చిన మున్నా సినిమాకు కూడా మొదటి షోతో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఫ్లాప్ వచ్చిన ఈ సినిమా కూడా 9 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.
Also Read: ముత్యాల్లాంటి NTR చేతిరాత…ప్రింట్ కాదండోయ్!