Telugu News » Blog » మారుతి దర్శకత్వంలో ప్రభాస్…ఆ సినిమాల కంటే ముందే రిలీజ్ …!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్…ఆ సినిమాల కంటే ముందే రిలీజ్ …!

by AJAY
Ads

ప్రభాస్ అంటే గుర్తుకు వచ్చేవి పాన్ ఇండియా సినిమాలే. ఒకప్పుడు సినిమాలు చక చకా పూర్తి చేసి వదిలిన ప్రభాస్ జక్కన్న తో బాహుబలి సినిమా మొదలు పెట్టిన తరవాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. దానికి కారణం ప్రభాస్ భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇప్పటికే ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ కొవిడ్ వల్ల వాయిదా పడింది.

Advertisement

Prabhas with maruthi

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇవి ఇలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఏకంగా పాన్ వరల్డ్ సినిమాకు ఒప్పుకున్నాడు.

Advertisement

prabhas

prabhas

వీటితో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇవన్నీ పెద్ద సినిమాలు. ఏళ్లు ఏళ్లు షూటింగ్ లకే టైం సరిపోతుంది. కానీ ప్రభాస్ మాత్రం త్వరగా స్క్రీన్ పై కనిపించి ఫ్యాన్స్ ను కుషి చేయాలని అనుకున్నారట.

Advertisement

అందుకోసం ప్రభాస్ ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మారుతి. అయితే డివివి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ తో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. దాదాపుగా ఈ సినిమా ఖరారు కాగా ఫైనల్ స్క్రిప్ట్ ను ప్రభాస్ వినాల్సి ఉండట. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ బడా సినిమాల కంటే ముందే. ఈచిత్రాన్ని పూర్తిచేసి రిలీజ్ చేస్తారట.

You may also like