Home » పెళ్లి గురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ పోస్ట్ లో అర్థం అదేనా..?

పెళ్లి గురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ పోస్ట్ లో అర్థం అదేనా..?

by Anji
Published: Last Updated on

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇన్​స్టాగ్రామ్​ లో ఓ పోస్ట్ చేసింది. బ్యూటీఫుల్ ఫొటోలతో పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ???  అంటూ క్యాప్షన్ పెట్టింది.పెళ్లి చేసుకోవాలా అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్ధా పెళ్లి గురించి హింట్స్ ఇస్తుందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

శ్రద్ధా పోస్ట్‌ను పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు కామెంట్ బాక్స్‌లోప్రశ్నల వర్షం కురిపించారు. శ్రద్ధాకపూర్ పంపించిన ఫొటోలను చూసి నెటిజన్స్ తెల్లటి ఎంబ్రాయిడరీ సల్వార్ సూట్‌లో దేవకన్యలా కనిపిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని వధువుగా చూడాలని ఎదురు చూస్తున్నాను.”ఓ నెటిజన్ అంటే “మేము వేచి ఉన్నాము!” మరో నెటిజన్ కామెంట్ చేశాడు.  “దయచేసి కార్లో, మీకు వరుడు దొరికాడా?” అంటూ ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు.

 గతేడాది శ్రద్ధ, రణబీర్ కపూర్‌తో కలిసి ‘తూ ఝూథీ మైన్ మక్కర్’ చిత్రంలో కనిపించింది. ఇప్పుడు 2018 హిట్ చిత్రం ‘స్త్రీ’  మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘స్త్రీ 2’ లో నటించనుంది. ఈ సినిమాలో  రాజ్‌కుమార్ రావుతో శ్రద్ధా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31, 2024న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Visitors Are Also Reading