తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ముందుకు సాగుతున్న ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Advertisement
తాజాగా హీరో ప్రభాస్ వాడేది విగ్గే అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. ఇప్పటివరకు తాను ప్రభాస్ ది ఒరిజినల్ జుట్టు అనుకున్నానని, కానీ ప్రభాస్ వాడేది విగ్గు అంటూ ఆయన ఒక వీడియో షేర్ చేశాడు. ఆయన షేర్ చేసిన వీడియో పాతదే అయిన అందులో ప్రభాస్ జుట్టు చెరిగిపోకుండా హెయిర్ స్టైలిస్ట్ ఆయన జుట్టు సరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఒరిజినల్ జుట్టుని స్టైల్ చేస్తున్నట్లు కాకుండా చాలా డెలికేట్ గా పట్టుకొని ఆయన జుట్టుని సరిచేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇలాంటి కామెంట్లు మీదకు వస్తున్నాయి.
Advertisement
వాస్తవానికి హీరోలు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళ జుట్టు కూడా వయసును బట్టి రాలిపోవడం, పలుచబడడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఒరిజినల్ జుట్టుని సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కనుక ఆయా సినిమాల కోసం దర్శకులు పాత్రల అవసరాన్ని బట్టి హీరోలు విగ్గులు ధరించడమో మరొకటో చేస్తూ ఉంటారు. ఇంత మాత్రాన ఇతర హీరోల ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ హీరోల విగ్గుల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదని మరి కొందరు అంటున్నారు.
READ ALSO : నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?
Odiyamma inni RojuLu hair Original Anukunna Kadara Barre @PrabhasRaju pic.twitter.com/jCUXimSlbn
— poorna ˢᵗʸˡᶦˢʰ 🔨 (@poorna041) December 21, 2022