ఇటీవలే అనారోగ్య కారణాలతో నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చి కలిసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాజ్ నాథ్ వెంట ప్రభాస్ ఉండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అదేవిధంగా కృష్ణంరాజు సంతాప సభకు కూడా వీరిద్దరూ కలిసి ఒకే కారులోనే వెళ్లారు. తనతో పాటు ప్రభాస్ కూడా సభకు వచ్చేలా చూశారు రాజ్ నాథ్ సింగ్.
వీటిని చదవండి: సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..? కారణాలు ఏమిటి..?
Advertisement
హైదరాబాద్ పర్యటనలో రాజ్ నాథ్ చాలా లోతైన రాజకీయ లెక్కలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుపై ఉన్న ప్రేమతో కాకుండా ప్రభాస్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యతతో దృష్ట్యా ఈ పర్యటన సాగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు 2024 ఎన్నికల్లో ప్రభాస్ ఫిల్మీ చరిష్మాను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత పాన్-ఇండియా స్టార్ మారిన ప్రభాస్‌ను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోంది.
Advertisement
వీటిని చదవండి: మెగాస్టార్ ని తిట్టినందుకు.. సారీ చెప్పిన ఇంద్ర రైటర్…!
ప్రభాస్ తో కర్నాటక, ఉత్తర భారత్ లో కూడా ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. ఇక కొస్తాంద్రా జిల్లాతో పాటు హైదరాబాద్‌లో ప్రధానంగా కొంపల్లి, కూకట్‌పల్లిలో క్షత్రియ ఓట్లను బీజేపీ గెలవడానికి ప్రభాస్ సహాయపడతారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించిన ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ పశ్చిమగోదావరి జిల్లా నరసపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. తన సోదరుడు ఎంపీగా బరిలో ఉంటే.. కచ్చితంగా ప్రభాస్ బీజేపీకి ప్రచారం చేయడం ఖాయం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఏపీలో బీజేపీ సీఎం జగన్ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు కూడా వినిపించడం గమనార్హం.
వీటిని చదవండి: DHEERA MOVIE REVIEW IN TELUGU : ధీర మూవీ రివ్యూ.. యాక్షన్స్ తో మెప్పించాడా..?