గత కొద్దిరోజులుగా ప్రభాస్ అనుష్క ల పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అనుష్క కలిసి మిర్చి, బాహుబలి సినిమాలలో నటించారు. బాహుబలి సినిమా షూటింగ్ తరవాత ప్రమోషన్స్ లో ఇద్దరూ ఒకరిపై మరొకరు చూపించుకునే కేరింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి : కుష్భూ ప్రేమకథలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా…? లవ్ లో ఎలా పడ్డారంటే..!
Advertisement
అంతే కాకుండా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని చూడముచ్చటి జంట అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆ వార్తలను అనుష్క ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ప్రభాస్ అనుష్కల పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
Advertisement
కాగా కృష్ణం రాజు చనిపోయిన సమయంలో అనుష్క కూడా ప్రభాస్ తో ఆస్పత్రిలో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా కృష్ణం రాజు సన్నిహితుడు నిర్మాత చిట్టిబాబు ప్రభాస్ అనుష్కల పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇవి కూడా చదవండి : టాలీవుడ్ నంబర్ 1 హీరో ప్రభాస్..! హీరోయిన్ ఎవరంటే..?
కృష్ణం రాజు కూతుళ్ల పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉందని అన్నారు. అంతే కాకుండా ప్రభాస్ కూడా త్వరలో పెళ్లి చేసుకుంటే కృష్ణం రాజు ఆత్మ సంతోషిస్తుందన్నారు. ప్రభాస్ అనుష్క ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. అంతే కాదు ఏడాది లోపే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అన్నారు. ఇక చిట్టిబాబు కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.