నటసింహం నందమూరి బాలయ్య నటించిన ఆఖండ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కథను పక్కన పెడితే బాలయ్య బోయపాటి సినిమా నుండి అభిమానులు ఏం ఆశిస్తారో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయంటూ సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఓవర్సీస్ లోనూ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య సినిమాలతో పాటూ టీడీపీ నేత మరియు హిందూపురం ఎమ్యెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ఫ్యాన్స్ అంటే టీడీపీ అభిమానులు కూడా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య ఎన్టీఆర్ ల సినిమాలు వస్తున్నయంటూ టీడీపీ కార్యకర్తలు కూడా సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తుంటారు.
Advertisement
potluri vara prasad
ఇక లేటెస్ట్ గా విడుదలైన అఖండ సినిమాపై కూడా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖండ సినిమా విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తాజాగా ఓ వైసీపీ నేత కూడా అఖండ సినిమాపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాత మరియు వైసీపీ నేత పొట్లూరి వి ప్రసాద్ అఖండ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. నా గమ్యం గమనం శివాధీనం అఖండ సినిమాను చూసాను…ఈ మాస్ జాతరను పూర్తిగా ఆస్వాదించాను.
Advertisement
సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి… ఏపీ సర్కార్ నిర్ణయంపై సిద్ధార్థ్ ఫైర్..!
అఖండ సినిమాతో పూర్వ వైభవం మళ్లీ వెలుగులతో తిరిగిరావాలని కోరుకుంటున్నా అంటూ పీవీపీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక అఖండపై పీవీపీ ప్రశంసలు కురిపించడంతో ట్విట్టర్ రచ్చ మొదలైంది. ఆయన టీడీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు మాత్రం అది సినిమా అని నచ్చితే నచ్చింది అని చెప్పాడు దానికి పార్టీ మారటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పీవీపీ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
"నా గమ్యం,గమనం శివాధీనం"
Been a while, many others and I ,thoroughly enjoyed మహా మాస్ జాతర, with messaging around Almighty, #Akhanda..
May the glory of cinema be back in full glow 👍— PVP (@PrasadVPotluri) December 3, 2021
Advertisement