ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. వాస్తవానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 02 నుంచి పదవతరగతి పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ దీనిని మే 09వ తేదీకి మార్చనున్నట్టు సమాచారం. దీనికి ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు జరగడమే అని తెలుస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మార్పులు చేసిన విషయం తెలిసినదే.
Advertisement
Advertisement
దీంతో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహిస్తారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పదవతరగతి పరీక్షలు మే 02 నుంచి 13 వరకు జరగాల్సి ఉంది. ఒకేసారి ఇంటర్, పదవతరగతి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుందన్న కారణంతో పదవతరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మార్పులు చేసిన షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు. దీంతో ఈరోజు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.
Also Read : IND VS SL 2nd Test : పింక్ బాల్ టెస్ట్‌ల్లో నూతన రికార్డు