Home » poonam pandey : ఆ పాత్ర‌ల్లో న‌టించినందుకు మా పేరెంట్స్ కొట్టారు : పూన‌మ్ పాండే

poonam pandey : ఆ పాత్ర‌ల్లో న‌టించినందుకు మా పేరెంట్స్ కొట్టారు : పూన‌మ్ పాండే

by AJAY
Ad

ఇండ‌స్ట్రీలో ఆఫ‌ర్లు రావ‌లంటే అందం అభిన‌యంతో పాటూ టాలెంట్ ఉండాలి. భాగా న‌టిస్తే ఆఫ‌ర్లు అవే వెత్తుకుంటూ వస్తాయి. కానీ కొంత‌మంది మీడియా అటెన్ష‌న్ కోసం అన‌వ‌స‌ర కామెంట్లు బోల్డ్ కామెంట్లు చేస్తుంటారు. ఆ లిస్ట్ లో బోల్డ్ బ్యూటీ పూన‌మ్ పాండే కూడా ఒక‌రు. అయితే తాజాగా పూన‌మ్ పాండే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

POONAM PANDEY

POONAM PANDEY

ప్ర‌తి ఒక్క‌రినీ త‌న‌వైపు తిప్పుకునేందుకు బోల్డ్ కామెంట్స్ చేశాన‌ని పూన‌మ్ చెప్పింది. అలా ప్ర‌వ‌ర్తించినందుకు ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపింది. కేవ‌లం ప‌దిహేడేళ్ల వ‌య‌సులోనే తాను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాన‌ని ఆ వ‌య‌సులో త‌న‌కు బాలీవుడ్ పై ఎలాంటి అవ‌గాహ‌న లేద‌ని చెప్పింది.

Advertisement

Advertisement

తాను న‌టించిన కొన్ని పాత్ర‌ల వ‌ల్ల త‌న ఇంట్లో పేరెంట్స్ కొట్టార‌ని తెలిపింది. అంద‌రికంటే భిన్నంగా ఉండేందుకు మీడియాను త‌న‌వైపు తిప్పుకునేందుకు మాత్రమే బోల్డ్ కామెంట్స్ చేశాన‌ని చెప్పింది. ఆ కామెంట్ల వ‌ల్ల ఇప్పుడు ఇబ్బంది ప‌డుతున్నాన‌ని…త‌న కెరీర్ ప‌ట్ల త‌ల్లి దండ్రులు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్య‌క్తం చేసింది.

ఇండ‌స్ట్రీలో చాలా కాలానికి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని ఇప్పుడు ఇక ప‌ని పైనే దృష్టి పెడ‌తాన‌ని పూన‌మ్ పాండే వెల్ల‌డించింది. అంతే కాకుండా త‌న‌ను తాను బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ లా ఊహించుకుంటున్నాన‌ని చెప్పింది. ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే కొత్తవారికి ఓ స‌ల‌హా ఇస్తున్నాన‌ని ఇక్క‌డ నిల‌దొక్కుకోవడం అంత ఈజీ కాద‌ని చెప్పింది.

Visitors Are Also Reading