Home » మహేష్ తో నటించేందుకు కండీషన్స్ పెట్టిన హీరోయిన్… ఎవరంటే..?

మహేష్ తో నటించేందుకు కండీషన్స్ పెట్టిన హీరోయిన్… ఎవరంటే..?

by Azhar
Ad

మన తెలుగులోని స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తప్పకుండ మొదటి వరుసలో ఉంటాడు. అయితే మహేష్ అందం చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అసూయా పడుతారు అనేది నిజం. అందుకే మహేష్ సినిమాలో నటించే అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అవకాశం వచ్చింది అంటే వెంటనే ఓకే చెబుతారు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం మహేష్ సినిమాలో నటించడానికి కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే.

Advertisement

మహేష్ బాబుతో ఇప్పటికే మహర్షి అనే సినిమాలో నటించిన పూజా హెగ్డే మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ తెలుగులో స్టేర్ హీరోయిన్ అయ్యి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టి అనేది పెడుతుంది. ఇక ఇప్పుడు ఇక్కడ తెలుగులో మహేష్ బాబు, త్రివ్రిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చేయడానికే పూజా హెగ్డే కండిషన్స్ పెట్టిందట.

Advertisement

అవేంటంటే.. మొదటగా ఈ సినిమా కోసం కేవలం తాను 45 రోజులు మాత్రమే ఇస్తానని పూజా హెగ్డే చెప్పిందట. అంతకంటే ఏకీవా ఇవ్వలేను అని చెప్పేసిందట. ఇక అదే విధంగా ఈ సినిమాకు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ తో పాటుగా.. షూటింగ్ జరిగినన్ని రోజులు తన స్టాఫ్ సాలరీ బిల్స్ అనేవి ప్రొడక్షన్ వారే భరించాలని తెలిపిందట. అయితే ఈ మధ్యే పూజా హెగ్డేకు సంబంధించిన స్టాఫ్ బిల్స్ అనేవి పెద్ద చర్చనీయాంశయమైన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు పూజా హెగ్డే అలాంటి కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా పరాజయానికి కారణాలు ఇవేనా..?

కోహ్లీని అవమానించిన బాబర్.. ”ఏ రికార్డ్”..?

Visitors Are Also Reading