Home » ఇండియా పరాజయానికి కారణాలు ఇవేనా..?

ఇండియా పరాజయానికి కారణాలు ఇవేనా..?

by Azhar
Ad

టీం ఇండియాకు ఎంతో కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. గత ఏడాది ఇండియా జట్టులో కరోనా కేసులు రావడం వల్ల 5 టెస్టుల సిరీస్ లో చివరి టెస్టును వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించారు. కానీ ఇందులో భారత జట్టు విజయం సాధించలేకపోయింది. అయితే ఇండియా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది అభిమానులు బాగా ఆలోచిస్తున్నారు. గత ఏడాది ఇంగ్లాండ్ జట్టును సులువుగా ఓడించడంతో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది అని టీం ఇండియా భావించి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ జట్టులోని ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు.

Advertisement

అయిన కూడా మొదటి ఇన్నింగ్స్ తర్వాత మంచి ఆధిక్యం లభించడంలో గెలుస్తాము అనే విశ్వసం ఆటగాల్లో ఎక్కువై ఉంటుంది. ఇక మన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లు విఫలం కావడం జట్టును బాగా దెబ్బ తీసింది. పుజారా, పంత్ అర్ధశతకాలు సాధించడం మినహా.. రెండో ఇన్నింగ్స్ లో అందరూ విఫలమయ్యారు. ఆ కారణంగా తొందరగా ఆల్ ఔట్ అయిన భారత జట్టు లక్ష్యం ఎక్కువగా నిర్ధేశించలేదు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రత్యర్థి ఆటగాళ్లను ముఖ్యంగా జానీ బెయిర్‌స్టోను రెచ్చగొట్టడం తప్పు అయ్యింది. కోహ్లీ చేసిన పని వల్ల బెయిర్‌స్టో తన దూకుడును పెంచి భారత బౌలర్లను చితకబాదాడు.

Advertisement

అదే విధంగా ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ అంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా కెప్టెన్సీ అనేది పనిచేయలేదు. అతని వ్యయాలు అనేవి బెడిసికొట్టాయి. జట్టులో అనుభవం ఉన్న కోహ్లీ నుండి బుమ్రా ఆ సమయంలో సలహాలు తీసుకోలేదా అని అనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా పిచ్ ను సరిగ్గా అంచనా వేయలేదు. ఈ పిచ్ పేసర్లకు మాత్రమే అనుకూలిస్తుంది అని అనుకున్నారు. కానీ పిచ్ స్పిన్నర్లకు కూడా కొంత అనుకూలించింది. అందుకే ఇంగ్లాండ్ జట్టులోని మాజీ కెప్టెన్ జో రూట్ వికెట్స్ అనేవి తీయగలిగాడు. ఇలాంటి తప్పుల వల్లే టీం ఇండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్ ను సమం చేసుకుంది.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

Visitors Are Also Reading