Home » కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ….!

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ….!

by AJAY
Ad

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ పూజ హెగ్డే. మొదటి సినిమా తో పూజ కుర్రాళ్ళ మనసు దోచింది. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరవాత పూజా వరస ఆఫర్స్ అందుకుంది. కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠ పురం సినిమా ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది.

pooja hegde

pooja hegde

ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ కావడం తో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లో పూజా హీరోయిన్ గా నటించింది. అదే విధంగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన ఇతర భాషల్లోనూ బిజీగా ఉంది.

Advertisement

Advertisement

ఇక పూజా పర్సనల్ కెరీర్ విషయానికి వస్తే…. చేతి నిండా సినిమాలతో పూజ ఫుల్ గా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చిన డబ్బుతో బట్టబొమ్మ కోరికలు అన్ని తీర్చుకుంటుంది.

Pooja Hegde

ఇప్పటికే పూజా హెగ్డే ముంబై లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముంబై లో పూజ హెగ్డే మరో ఇంటిని కూడా నిర్మించుకుంది. ఇక తాజాగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేసింది. ఇంట్లో పూజ చేస్తూ దానికి సంభందించిన ఫోటోలని పూజ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Visitors Are Also Reading